»   » ఇంట్లోకి టివి తీసుకోని రాకపోవడానికి కారణం అదే అంటున్న హీరోయిన్

ఇంట్లోకి టివి తీసుకోని రాకపోవడానికి కారణం అదే అంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ హీరోయిన్ కైరా నైట్లీ ఇటీవల ఇంటర్యూలో ఓ అరుదైన విషయాన్ని వెల్లడించారు. ఆవిషయం ఏమిటంటే కైరా నైట్లీ ఇంట్లో అస్సలు టివి లేదనే నిజాన్ని తన అభిమానులకు వెల్లడించారు. సాధారణంగా ఇంట్లో టివి ఉంటే మనం అందరం రియాలిటీ టివిషోలు అయినటువంటి అమెరికన్ ఐడియల్, కీపింగ్ విత్ కర్దాషియాన్స్ లాంటి షోలకు బానిసలు అవుతాం అనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని అన్నారు.

ఇది మాత్రమే కాకుండా తాను ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటర్నేట్ కనేక్షన్‌ని కూడా కట్ చేయడం జరుగుతుందని అన్నారు. టివి మరియు ఇంటర్నేట్ అనే వాటికి ఒకసారి అలవాటు పడ్డామంటే అంతే ఇక జీవితంలో వాటినుండి బయటకు రావడం చాలా కష్టం అన్నారు. అంతేకాకుండా గంటల తరబడి టైం వెస్టు చెయ్యవలసి వస్తుందని అన్నారు. అందుకే అటువంటి వాటిని నేను ఎక్కువగా ఇష్టపడను అన్నారు.

వీటికి కనుక మనం అలవాటుపడితే ప్రపంచంలో మన అంత సోమరిపోతులు ఇంక ఎవరూ ఉండరన్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మన పని అయిపోయేంత వరకు మాత్రమే ఇంటర్నేట్ చేసుకోవడం మంచిది కానీ, అదే పనిగా గంటలు తరబడి దాని ముందు కూర్చోని టైం వేస్టు చేయకూడదన్నారు. అందుకే వాటికి నాఇంట్లో ఇంత వరకు ప్రవేశం కల్పించలేదన్నారు.

English summary
Actress Keira Knightley has revealed that she does not have a television at her home. The ‘Pirates of the Caribbean’ star refuses to keep a TV in her house because she's convinced she would become an addict if she had access to reality shows. Knightley prefers to read or sketch, and is even considering cutting off her Internet connection to ensure she makes the most of her free time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu