Just In
- 35 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'స్పైడర్ మ్యాన్' ఫ్యాన్స్ కు శుభవార్త
లాస్ ఏంజిల్స్ : 'స్పైడర్ మ్యాన్' సీరిస్ లో వస్తున్న చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అది గమనించే ఈ చిత్రాల్లో ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ వస్తున్నారు నిర్మాతలు, దర్శకులు. కొత్తదనం లేకపోతే సీక్వెల్స్ భరించటం కష్టమని అర్దం చేసుకున్న యూనిట్ వాటిపై నిరంతరం కసరత్తు చేస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రతీసారిలాగే ఈ సారి స్క్రిప్టు లో ఎలాగు కొత్తదనం ఉంటుంది..దానికి తోడు విలన్స్ కూడా కొత్తగా చూపాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. తమ తాజా చిత్రం యాంట్ మ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మార్వెల్ స్టూడియోస్ సంస్థ అధ్యక్షుడు కెవిన్ ఫ్రెడ్జ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ... కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రంలో విలన్లు కూడా కొత్త వారే కనిపిస్తారని తెలిపారు. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో డాక్టర్ ఆక్టోపస్, శాండ్ మ్యాన్ తదితరులు విలన్లుగా కనిపించారని అయితే ఈ చిత్రంలో మళ్లీ వారినే విలన్లుగా చూపించదలుచుకోలేదని తెలిపారు.
అభిమానులు ఇప్పటి వరకు ఎక్కడా చూడలేని పాత్రను ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. స్పైడర్ మ్యాన్ కొత్త చిత్రం జూలై 28, 2017లో విడుదల కానుంది. ఈ చిత్రం గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా మరింత ప్రజాదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని విశేషాలు...
స్పైడర్ మాన్‌గా మారిన హీరోపీటర్ పార్కర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన సాహసాలు గుర్తున్నాయి కదా. ఈ కొత్త చిత్రాన్ని కూడా స్పైడర్ మా స్కూల్ జీవితం ప్రధానాంశంగా తెరకెక్కించనున్నారు. స్పైడర్ మాన్ చిత్రాలు నిర్మించే మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫీగ్ ఈ విషయం తెలిపారు.
'హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు స్పైడర్ మాన్ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రంలో వాటిని ప్రేక్షకులను మరింత వినోదాన్ని అందించేలా తీర్చిదిద్దుతామ''ని కెవిన్ చెప్పారు.
సోనీ పిక్చర్స్, మార్వెల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ పాత్ర కోసం 19 సంవత్సరాల బ్రిటీష్ నటుడు టామ్ హోలాండ్‌ను ఎంపిక చేశారు. స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ సినిమాకు జాన్ వాట్స్ దర్శకత్వం వహించనున్నారు.
సోనీ పిక్చర్స్ ఛైర్మన్ రోత్ మన్ మాట్లాడుతూ.. హీరో పాత్ర కోసం ఎందరో యువ నటుల్ని పరిశీలించామని చెప్పారు. టామ్ స్కీన్ ప్రత్యేకంగా కనిపించాడని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.
ఈ కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రం పీటర్ పార్కర్ విద్యాబ్యాసం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కాగా, 2012లో విడుదలైన సునామీ డ్రామా 'ది ఇంపాజిబుల్'లో టామ్ హోలాండ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలో రిలీజ్ కానున్న 'సివిల్ వార్' చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది.