twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ప్లాప్ చేసి... ప్రజలు ఆ హీరోకు బుద్ది చెప్పారా?

    By Bojja Kumar
    |

    హాలీవుడ్‌ నటుడు కెవిన్‌ స్పేసీ నటించిన 'బిలియనేర్‌ బాయ్స్‌ క్లబ్‌' సినిమా బాక్సాపీసు వద్ద దారుణమైన పరాజయం పాలవ్వడం అమెరికాలో చర్చనీయాంశం అయింది. తొలివారం ఈ చిత్రం అక్కడ కేవలం 618 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కెవిన్‌ స్పేసీ కెరీర్లోనే ఇది వస్ట్ మూవీగా యూఎస్ పత్రికలు పేర్కొంటున్నాయి.

    కెవిన్ స్పేసీ సాధారణ నటుడు కాదు, రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఘనుడు. ఈ స్థాయి నటుడు సినిమా అంటే మినిమమ్ కలెక్షన్స్ ఆశిస్తారు ఎవరైనా. కానీ ఈ మూవీ ప్లాప్ అవ్వడానికి కారణం అతడి మీద ప్రజల్లో ఏర్పడిన ద్వేషమే కారణమని అంటున్నారు.

    Kevin Spacey film earns measly $618 at box office

    11 థియేటర్లలో సినిమా విడుదలైతే... వారం పాటు ప్రదర్శించబడి కేవలం 618 డాలర్లు మాత్రమే రావడంతో... సగటున రోజుకు ఆరుగురు కూడా ఈ సినిమా చూడలేదన్నమాట. ఈ హీరో మీద ప్రజల్లో ఇంతలా ద్వేషం ఏర్పడటానికి కారణం అతడి మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే అంటున్నారు.

    దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ.... 'బిలియనేర్‌ బాయ్స్‌ క్లబ్‌' మూవీలో కెవిన్‌ స్పేసీ ఒక చిన్న పాత్ర మాత్రమే చేశాడని, అతడి మీద కోపంతో సినిమాకు రాకుండా ఉండొద్దని కోరుతున్నారు. ఈ మూవీ 1980లో ఓ బిలియనీర్ బాయ్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కించారు.

    English summary
    US actor Kevin Spacey’s latest film Billionaire Boys Club has flopped big-time at the box office, taking in a mere $618 as it opened to dire reviews in a handful of theatres across the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X