»   » వావి వరుసల్లేకుండా ఆమెతో సంబంధం... తమ్ముడిపై టీవీ స్టార్ ఫైర్!

వావి వరుసల్లేకుండా ఆమెతో సంబంధం... తమ్ముడిపై టీవీ స్టార్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ ఖ్లోయి కర్దాషియాన్ తన తమ్ముడు రాబ్ వ్యవహార శైలిని దయ్యబట్టింది. అందుకు కారణం అతడు బ్లాక్ చైనా అనే ఓ మోడల్‌తో డేటింగ్ చేయడమే. త్వరలో ఇద్దరూ పెళ్లికి కూడా సిద్ధం అవుతుండటంతో ఖ్లోయి కర్దాషియాన్ అతని తీరును మీడియా ముందే కడిగేసింది.

రాబ్- బ్లాక్ చైనా మధ్య సంబంధం.... కర్దాషియాన్ ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదు. వావి వరుసలు లేకుండా వీరిద్దరు ప్రవర్తిస్తున్నారంటూ ఆ ఫ్యామిలీ మొత్తం ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు రాబ్-బ్లాక్ చైనా సంబంధాన్ని కర్దాషియాన్ ప్యామిలీ వ్యతిరేకించడానికి పెద్ద కారణమే ఉంది.

Khloe Kardashian 'feels betrayed' by Rob and Blac Chyna's romance

ప్రస్తుతం రాబ్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న బ్లాక్ చైనా... గతంలో టైగాతో ఎఫైర్ కొనసాగించింది. టైగా ద్వారా ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. తర్వాత ఇద్దరు విడిపోయారు. టైగా ఇపుడు రాబ్ సవతి సోదరి కైలీ జెన్నర్ తో డేటింగ్ చేస్తున్నాడు. టైగాతో గతంలో సంబంధం పెట్టుకుని తల్లయింది కాబట్టి బ్లాక్ చైనా.... కూడా రాబ్‌కు సోదరి వరుస అవుతుంది.

అందుకే రాబ్-బ్లాక్ చైనా పెళ్లి చేసుకోవడాన్ని కర్దాషియాన్ ఫ్యామిలీ వ్యతిరేకిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో కూడా చెప్పకుండా రాబ్-బ్లాక్ చైనా నిశ్చితార్థం చేసుకున్నారు. తమ్ముడి తీరుపై ఖ్లోయి కర్దాషియాన్ స్పందిస్తూ రాబ్ తీరు కుటుంబాన్ని వెన్నుపోటు పొడవటమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. అతని నిశ్చితార్థంపై తాము స్పందించబోమని, శుభాకాంక్షలు కూడా తెలుపబోమని ఖ్లోయి కర్దాషియాన్ తేల్చి చెప్పింది. మరో సోదరి కిమ్ కర్ధాషియాన్ కూడా ఈ విషయమై స్పందించడానికి నిరాకరించారు.

English summary
Khloe Kardashian reportedly feels "betrayed" by her brother Rob 's relationship with Blac Chyna and thinks he is showing the family a "lack of respect".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu