Just In
- 23 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినిమా కంటే పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత: మేఘన్ ఫాక్స్
మేఘన్ ఫాక్స్ అమెరికన్ హీరోయిన్, మోడల్. 2001లో టెలివిజన్, చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ 'హొప్ అండ్ ఫెయిత్' టెలివిజన్ షో ద్వారా ఎక్కువ నిడివి కలిగిన పాత్రను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టీనేజ్ డ్రామా క్వీన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. 2009లో 'ట్రాన్స్ ఫార్మర్స్' సినిమా ద్వారా హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎఫ్‌హెచ్ఎమ్, మాక్సిమ్ మెన్స్ మ్యాగజైన్‌లలో అప్పుడప్పుడు కవర్ పేజిపై నగ్నంగా కనిపించడంతో సెక్స్ సింబల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. 25 సంవత్సరాల వయసు కలిగిన మేఘన్ ఫాక్స్ ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ హాలీవుడ్ సినీ కెరియర్‌తో పోల్చితే తనకి పుట్టబోయే పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని తెలిపారు. తన భర్త బ్రెయిన్ ఆస్టిన్ గ్రీన్‌తో కలసి మొదటి బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.
మూవీతో పోల్చితే పిల్లలకే నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను. వయసులో ఉన్నప్పుడు సినిమాలలో నటించిన తీరు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నటించలేమని అన్నారు. 20 మరియు 30 వయసులో ఉన్న నటీమణులు చాలా పని ఒత్తిడిని అనుభవిస్తున్నారని నేను భావిస్తున్నాను.. నాకైతే ఆ భయం లేదని అన్నారు.
2008లో సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అవార్డుని కైవసం చేసుకున్న మేఘన్ ఫాక్స్ 2004లో బ్రైన్ ఆస్టన్ గ్రీన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టి జూన్ 2010లో పెళ్సి చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా మేగన్ ఫాక్స్‌ని అభిమానులు అందరూ ముద్దుగా జూనియర్ ఏంజిలీనా జోలీగా అభివర్ణిస్తారు. 25 సంవత్సరాల వయసు కలిగిన మేగన్ ఫాక్స్ తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోని తన కుడి చేతిపై టాటూగా వేయించుకోవడం జరిగింది.