»   » ఆగస్టు 20న పెళ్లికి అంతా సిద్దం చేసుకున స్టార్ హీరోయిన్

ఆగస్టు 20న పెళ్లికి అంతా సిద్దం చేసుకున స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో సామాజిక వేత్తగా, మంచి ఫిజక్ ఉన్న పర్సనాలిటీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కిమ్ కర్దాషియాన్ త్వరలో ఓ ఇంటి ఆడపడుచు కాబోతుంది. బాస్కెట్ బాల్ ఛాంపియన్ క్రిస్ హాంప్రస్ గత మే నెలలో కిమ్ కర్దాషియన్‌కి తన ప్రేమని గురంచి చెప్పడం, ఆ తర్వాత కిమ్ కూడా తన ప్రేమని ఓకే చెయ్యడం జరిగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు కలసి ఉన్నటువంటి ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆగస్టు 20న వీరి పెళ్లి రోజుగా ఖరారు చేయడం జరిగిందని సమాచారం.

జులై చివరి వారం వరకు ఇద్దరూ కూడా వారి వారి స్నేహితులకు బ్యాచిలర్ పార్టీలు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఈ పెళ్లికి కిమ్ కర్దాషియాన్ దాదాపు 1000 మంది వరకు గెస్టులను ఆహ్వానించిందని సమాచారం. ఐతే ప్రస్తుతానికి వీరిద్దరి వివాహాం జరిగే స్దలం మాత్రం నిర్ణయించలేదు. ఈ సందర్బంలో కిమ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రస్తుతానికి లోకేషన్ మాత్రం చూడలేదు. ఇప్పటికే వెయ్యి మంది గెస్టులను ఆహ్వానించడం జరిగింది. ఓరిజినల్ ఐడియా ఐతే మాత్రం పెళ్లిని ఈస్ట్ కోస్ట్‌లో చేయాలని అనుకుంటున్నామని అన్నారు. పెళ్లి కూడా చాలా గ్రాండ్‌గా, వైభవంగా చేయాలని ఆలోచిస్తున్నామని అన్నారు.

పెళ్లి జరిగే స్దలం, గెస్టులు ఎవరెవరు వస్తారనే విషయం కిమ్ కర్దాషియాన్ స్వయంగా వెల్లడించున్నారు. పెళ్లిని చాలా వైభవంగా జరపాలని కిమ్ ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి కిమ్ కర్దాషియన్‌కి రెండవ పెళ్లి. తన మాజీ భర్త రెగ్గీ బుష్ గురించి అడడగా దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అని అన్నారు. నేను ప్రేమించినటువంటి వ్యక్తి, నా మనసుకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి క్రిస్ కాబట్టి క్రిస్‌ని పెళ్శిచేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా పిల్లలను కనాలని అనే నా డ్రీమ్‌ని నెరవేర్చుకునేటుటవంటి సమయం దగ్గర పడింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

English summary
Socialite Kim Kardashian all set to tie knot with her fiance Kris Humphries Aug 20. The 30-year-old and her basketball star fiance – who proposed to her in May – will tie the knot after enjoying separate bachelor and bachelorette parties later this month, reports the New York Post.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu