»   » రియల్ ‘ప్లేబాయ్’ మరణంతో విషాదంలో హీరోయిన్లు, మోడల్స్!

రియల్ ‘ప్లేబాయ్’ మరణంతో విషాదంలో హీరోయిన్లు, మోడల్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ప్లే బాయ్'.. ఈ పేరు వింటే చాలు ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లు, మోడల్స్ నగ్న చిత్రాలే మదిలో మెదులుతాయి. సంచలన మేగజైన్‌గా పేరుగాంచిన 'ప్లే బోయ్' వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు.

అమెరికాలో ప్రారంభమైన 'ప్లే బాయ్' మేగజైన్‌ ఎంతో మంది అందగత్తెల అందాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ప్లే బాయ్ మేగజైన్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ.... అందులో ఎక్కువగా హీరోయిన్ల నగ్న ఫోటోలో ఉండటంతో ఇండియాలో చాలా మంది దీన్ని బూతు మేగజైన్‌గా పిలుస్తుంటారు. ఇండియన్ కల్చర్‌కు అస్సలు సూటవ్వని మేగజైన్ ఇది.

హ్యూ హెఫ్నర్

‘ప్లే బోయ్' మేగజైన్ స్థాపించిన హ్యూ హెఫ్నర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్లేబోయ్ మేగజైన్ అఫీషియల్ గా వెల్లడించింది. 1926లో చికాగోలో జన్మించిన హ్యూ హెఫ్నర్ కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1953లో ఆయన కేవలం 1600 డాలర్లతో 'ప్లే బాయ్‌'ను ప్రారంభించారు.

హీరోయిన్లు, మోడల్స్ నివాళి

హీరోయిన్లు, మోడల్స్ నివాళి

ప్లేబోయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన.... ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న పలువురు ప్రపంచ ప్రఖ్యాత మోడల్స్, హీరోయిన్లు హెఫ్నర్ మరణంతో విషాదంలో మునిగి పోయారు.

పారిస్ హిల్టన్

హ్యూ హెఫ్నర్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మహకు శాంతి చేకూరాలని పారిస్ హిల్టన్ ట్వీట్.

కిమ్ కర్దాషియాన్

కిమ్ కర్దాషియాన్

హ్యూ హెఫ్నర్‌ మరణంపై సంతాపం వ్యక్యం చేస్తూ ప్రముఖ అమెరికన్ తార కిమ్ కర్దాషియాన్ ట్వీట్.

లవ్ యూ హెఫ్

లవ్ యూ హెఫ్... అంటూ పారిస్ హిల్టన్ తన ప్లేబాయ్ కవర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

షెర్లిన్ చోప్రా

ఇండియన్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ప్లేబాయ్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోజులు ఇచ్చిన సంచలనం అయింది. హ్యూ హెఫ్నర్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేశారు.

సెక్స్ గురించే

సెక్స్ గురించే

ప్లే బాయ్ మ్యాగజైన్.. కవర్‌​ పేజీ సహా మొత్తం నగ్న ఫొటోలతో కథనాలను ప్రచురించేంది. సెక్స్ కు సంబంధించిన ఆరోగ్యకర అంశాలను చర్చించాలనే లక్ష్యంతోనే తాను ప్లేబాయ్ కి రూపమిచ్చినట్లు హ్యూ హెఫ్నర్ తరచూ చెబుతుండేవారు.

ఎన్నో వివాదాలు

ఎన్నో వివాదాలు

అయితే మధ్యలో చాలా వివాదాలు చుట్టుముట్టాయి. న్యూడ్ ఫొటోలతో పూర్తిగా మ్యాగజైన్ ను నింపేస్తున్నారని, ఈ మ్యాగజైన్ పై నిషేధం విధించాలని పలువురు ఆందోళన చేశారు. అదే సమయంలో యూఎస్‌ తపాలా శాఖ ప్లే బాయ్ మ్యాగజైన్ ను బట్వాడా చేయకుండా నిలిపివేసింది. ఈ విషయంలో హ్యూ హెఫ్నర్ న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. అలా వివాదాల తర్వాత కాస్త సర్క్యులేషన్‌ తగ్గినప్పటికీ... ప్లే బాయ్‌ మ్యాగజైన్ కు అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

ఆ నిర్ణయం వెనక్కి

ఆ నిర్ణయం వెనక్కి

ఏడాదిన్నర క్రితం ప్లే బాయ్ యాజమాన్యం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ మ్యాగజైన్ లో నగ్న చిత్రాలను ప్రచురించబోమని సంచలన ప్రకటన చేసింది. కానీ, ఏడాది గడవకముందే మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్లే బాయ్ యాజమాన్యం ప్రకటించింది. మార్చి నెల నుంచి మళ్లీ పాత తరహాలో నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ని తీసుకొచ్చేసింది. వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది కూడా. వయసు పై బడటంతో హ్యూ హెఫ్నర్ గతంలోనే ప్లేబాయ్ చీఫ్ బాధ్యతలను తన కొడుకు జూనియర్‌ హెఫ్నర్ కు అప్పగించారు.

English summary
Playboy founder Hugh Hefner passed away yesterday much to the shock of everyone including celebrities like Kim Kardashian, Paris Hilton and Sherlyn Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu