»   » ఆడపిల్లకు జన్మనివ్వబోతున్న సెక్సీలేడీ

ఆడపిల్లకు జన్మనివ్వబోతున్న సెక్సీలేడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ తన ప్రియుడు, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్న వీరు అంతకు ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ జంట ఓ ఆసక్తికర విషయం బయటకు వెల్లడించారు. తమకు ఆడ పిల్ల పుట్టబోతోందనే విషయం వెల్లడించారు. డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే ఈ విషయం వెల్లడించినట్లు తెలియజేసారు. ఈ విషయం విన్న అమె అభిమానులు మరో బుల్లి కిమ్ కర్ధాషియాన్ రాబోతోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

32 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. కిమ్ కర్ధాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది.

కేన్‌తో సంబంధాన్ని ఏర్పరుచుకోవడంపై కిమ్ కర్దాషియాన్ స్పందిస్తూ...మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు మా మధ్య ఉన్న స్నేహాం అనుకూలిస్తుందని పేర్కొంది. మా ఇద్దరి గురించి మాకు బాగా తెలుసు. ఇద్దరి మనుషుల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే స్నేహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పుకొచ్చింది. కిమ్ కర్దాషియాన్ డెలివరీ అయ్యాక వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.

English summary

 Kanye West can pass down that leather skirt to his future child: He and Kim Kardashian are expecting a daughter. The big reveal of the baby's sex came Sunday night on Kardashian's E! reality show, "Keeping Up With the Kardashians."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu