»   » మ్యారేజ్ రింగు వేలం: హీరోయిన్ మాజీ భర్త ఘనకార్యం?

మ్యారేజ్ రింగు వేలం: హీరోయిన్ మాజీ భర్త ఘనకార్యం?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ నటి, మోడల్ కిమ్ కర్దాషియాన్ మాజీ భర్త క్రిస్ హాంప్రిస్‌ ఆమె చెందిన 20 క్యారెట్ల ఎంగేజ్మెంట్ డైమండ్ రింగును వేలం వేయబోతున్నాడట. యూఎస్ మేగజైన్ కథనం ప్రకారం అక్టోబర్ 15న న్యూయార్కులోని ఓ ప్రముఖ వేలం కంపెనీ ద్వారా ఈ రింగ్ వేలం వేయబోతున్నట్లు తెలుస్తోంది.

  అయితే వేలం నిర్వహిస్తున్న వారు మాత్రం...ఈ రింగు కిమ్ కర్ధాషియాన్‌కు సంబంధించినదే అనే విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. ఈ రింగకు వేలంలో 3 లక్షల అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల అమెరికన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

  కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ఇష్టపడి బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రిస్‌ని అక్టోబర్ 31న పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని 72 రోజులకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య విడాకులకు కారణం ఏమిటా అని ఆరా తీసిన ఇంటర్నేషనల్ మీడియా ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ ఇద్దరి పెళ్లి వ్యవహారం విడాకుల వరకు వెళ్లడానికి కారణం ఓ యోగా గురువు.

  అతడి దగ్గర కిమ్ శిష్యరికం చేసినందుకే క్రిస్ కు చిర్రెత్తింది. యోగా నేర్చుకోవడంలో తప్పేమీ లేక పోయినా..... యోగా గురువు ప్రవర్తన కిమ్ మొగుడు క్రిస్ కు నచ్చలేదు. ఎందుకంటే అతడు నగ్నంగా యోగా పాఠాలు నేర్పిస్తాడు. ఇది నచ్చని క్రిస్ అతని క్లాసులకు వెళ్లొద్దని కిమ్ ను వారించాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి విడాకులు తీసుకునే రేంజ్ కి విబేధాలు పెరిగాయని అప్పట్లో చర్చించుకున్నారు.

  ఇపుడు కిమ్ కర్ధాషియాన్ తన బాయ్ ఫ్రెండ్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో కలిసి ఉంటోంది. వీరికి ఓ పాప కూడా జన్మించింది. స్లైడ్ షోలో......మాజీ భర్త క్రిష్ హాంప్రిస్‌‌తో కిమ్ కర్ధాషియాన్ ఫోటోలు, వివరాలు తెలుసుకోండి.

  ఎప్పటి నుంచి డేటింగ్ చేసారంటే...

  ఎప్పటి నుంచి డేటింగ్ చేసారంటే...

  2010 సంవత్సరంలో న్యూజెర్సీలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుండే వీరు డేటింగ్ మొదలు పెట్టారు. రంజుగా ప్రేమాయణం సాగించారు.

  మియామీ బీచ్‌లో...

  మియామీ బీచ్‌లో...

  2011 మే 13న వీరు అమెరికాలోని ఫ్లోరిడా మియామీ బీచ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఎఫైర్ ఉందనే విషయం బట్టబయలైంది.

  కిమ్-క్రిస్ ఎంగేజ్మెంట్

  కిమ్-క్రిస్ ఎంగేజ్మెంట్

  దాదాపు ఆరు నెలల డేటింగ్ తర్వాత కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంప్రిస్‌కు మే 25, 2011న ఎంగేజ్మెంట్ జరిగింది.

  వెడ్డింగ్ కేక్ సెలక్ట్ చేసుకున్నారు కూడా...

  వెడ్డింగ్ కేక్ సెలక్ట్ చేసుకున్నారు కూడా...

  కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంప్రిస్‌ జులై 29, 2011 లాస్ ఏంజిల్స్‌లో ఈ జంట వెడ్డింగ్ కేక్ సెలక్ట్ చేసుకుంటూ కనిపించారు.

  పెళ్లి కూడా చేసుకున్నారు

  పెళ్లి కూడా చేసుకున్నారు

  కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంప్రిస్‌ ఆగస్టు 20, 2011లో పెళ్లాడారు. వెంటనే హానీమూన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేసారు.

  పెళ్లి తర్వాత సంతోషంగా గడిపారు

  పెళ్లి తర్వాత సంతోషంగా గడిపారు

  2011 సెప్టెంబర్ వరకు వీరి బంధం బాగానే సాగింది. కిమ్ కర్ధాషియాన్, ఆమె సోదరి ఎవరు ముందు బిడ్డను కంటారనే పోటీ కూడా పెట్టుకున్నారట అప్పట్లో...

  గొడవపడ్డారు

  గొడవపడ్డారు

  ఏమైందో తెలియదు కానీ...పెళ్లియి మూడు నెలలు గడవక ముందు వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయం బయటకు కూడా పొక్కింది.

  రింగు లేకుండా కనిపించిన హాంప్రిస్‌

  రింగు లేకుండా కనిపించిన హాంప్రిస్‌

  వీరి మధ్య గొడవలు మొదలయ్యాయనే విషయం బయటకు పొక్కిన కొన్ని రోజులకే హాంప్రిస్ ఎంగేజ్మెంట్ రింగ్ లేకుండా కనిపించాడు.

  విడాకులు

  విడాకులు

  పెళ్లి చేసుకొని 72 రోజులకే విడాకుల కోసం కోర్టుకెక్కారు ఈ జంట. ఈ విషయం అప్పట్లో మీడియాలో చర్చనీయాంశం అయింది.

  English summary
  Kim Kardashian's ex-husband Kris Humphries is reportedly auctioning off her 20-carat diamond engagement ring. The NBA player has apparently listed the ring, which is one of the last remnants of the couple's 72-day marriage, for an October 15 sale at Christie's auction house in New York City, reported Us magazine.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more