»   » ట్విట్టర్‌ ఎకౌంట్‌ని పాపులారిటీ కోసం వాడుకుంటున్న స్టార్ హీరోయిన్

ట్విట్టర్‌ ఎకౌంట్‌ని పాపులారిటీ కోసం వాడుకుంటున్న స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక పని చేసి వార్తల్లోకి రావాలనే తాపత్రయం ఉన్న నటీమణుల్లో కిమ్ కర్దాషియాన్ ఒకరు. కీపింగ్ విత కర్దాషియాన్స్ అనే రియాలిటీ టివి కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీని సంపాదించారు కిమ్ కర్దాషియాన్. ఇటీవల కాలంలో హీరోయిన్స్ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ట్విట్టర్‌ని కూడా కొంత మంది తారలు వాళ్శ యొక్క పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారు. అటువంటి వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ తార కిమ కర్దాషియాన్.

ఈ రియాలిటీ టివి స్టార్ తన భర్త గాబ్రియేల్ ఆర్బి నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా మందితో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తేలిసిందే. నెల క్రితం న్యూజెర్సీ లోని బాస్కెట్ బాల్ నెట్స్‌లో బాస్కెట్ బాల్ ప్లేయర్‌ క్రిస్ హాంపరీస్‌తో ఎంజాయ్ చేస్తూ తిరిగారు. అలా వారిద్దరి మద్య ఉన్నటువంటి చనువు కొద్దగా ముదిరి డేటింగ్ దాకా వెళ్శాయని వార్తలు హాలీవుడ్‌లో సంచారం చేస్తున్నాయి. ఇలాంటి వార్తలను నిజం చేయడం కోసమే కాబోలు నిన్న తన ట్విట్టర్‌లో కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయినటువంటి క్రిస్ హాంపరీస్‌ చిన్నతనంనాటి పిక్చర్‌ని పోస్ట్ చేయడం జరిగింది.

పిక్టర్‌ని పోస్ట చేయడమే కాకుండా ఆపిక్టర్ క్రింద నాకు పుట్టబోయేటటువంటి బేబి కూడా అచ్చం ఇలాగే ఉండాలంటూ రాశారు. దానితో వీరిద్దరి మద్య ఉన్నటువంటి సంబంధాన్ని కిమ కర్దాషియాన్ స్వయంగా ఒప్పుకున్నట్టు అయిందని ఆమె అభిమానులు సందేహాన్ని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా మొన్నటికి మొన్న తన ట్విట్టర్లో కిమ్ కర్దాషియాన్ తన అందంతో మతి పోగోట్టేవిధంగా ఫోటో ఫోజు లివ్వడం జరిగింది. బ్లాక్ కలర్ బికిని వేసుకోని అందిరిని రెచ్చగొట్టే విధంగా తన అందాలను బికిని లో ప్రదర్శించి ఈఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పెట్టడం జరిగింది. దీనివలన ఈఫోటోలను చూడడం కోసం అభిమానులు చాలా మంది కిమ్ కర్దాషియాన్ ని ఫాలో అవ్వడం జరిగిన విషయం తెలిసిందే.

English summary
It looks like Kim Kardashian has babies on her mind. The reality TV star tweeted a cute childhood pic of her alleged beau Kris Humphries. "I want my son to look like this!" Kardashian wrote. About a month ago, Kardashian first stepped out with the New Jersey Nets basketball player, 25 - just days after splitting from model Gabriel Aubry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu