»   » రాయల్ వెడ్డింగ్‌ని తలపించిన సెక్సీ తార మ్యారేజి

రాయల్ వెడ్డింగ్‌ని తలపించిన సెక్సీ తార మ్యారేజి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ తను ప్రేమించిన బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ ఇద్దరూ అంగరంగా వైభవంగా కాలిఫోర్నియాలోని మోంటిసిటోలో ఓ ప్రయివేట్ ఎస్టేట్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి కిమ్ కర్దాషియాన్ ఏప్రిల్‌లో జరిగిన ప్రిన్స్ విలియమ్స్ ఎంత డబ్బు ఐతే ఖర్చు పెట్టారో సుమారుగా దానికి సమానంగా ఖర్చు చేశారని హాలీవుడ్ సినీ జనాలా కొడై కూస్తున్నారు. అంతేకాకుండా కిమ్ కర్దాషియాన్ ఈ పెళ్లికి పిలిచిన గెస్టులు కూడా చాలా ముఖ్యమైన సెలబ్రిటీలు కావడం విశేషం. ఈ పెళ్లికి కిమ్ కర్దాషియాన్ ధరించిన గౌను ప్రిన్స్ విలియమ్స్ పెళ్లికి కేట్ మిడిల్టన్ చెల్లెలు పిప్పా మిడిల్టన్ ధరించిన గౌను లాగే ఉందని కిమ్ తల్లి ఎంతో సంతోషపడింది.

ఇక కిమ్ పెళ్లికి హాలీవుడ్ సెలిబ్రిటీలు ఇవా లంగోరియా, లిండ్సేలోహాన్, సింగర్ మెలనీ బ్రౌన్, బాస్కెట్ బాల్ ప్లేయర్ కార్మిలో ఆంటోని, బాక్సర్ సుగర్ రే లియానార్డో తదితరులు హాజరవ్వడం జరిగింది. కిమ్ కర్దాషియాన్ పెళ్లిలో హైలెట్‌గా నిలిచింది మాత్రం కిమ్ ధరించిన వీర వాంగ్ గౌన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్ సిస్టర్ కేల్ కర్దాషియాన్ తను ధరించిన గౌను గురించి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఓ రేడియో జాకీని ఏర్పాటు చేసింది. ఈ గౌనుని అమెరికాలోనే పెద్ద ప్యాషన్ డిజైనర్ వీర వాంగ్ డిజైన్ చేయడం చేయడం జరిగింది.

ఇక పెళ్లికి ముందు కిమ్, క్రిస్ ఇద్దరూ కలసి లాస్ ఏంజిల్స్‌‍లో వెడ్డింగ్ కేక్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కేక్ కోసం కిమ్ కర్దాషియాన్ సుమారుగా 15,000 నుండి 20,000 డాలర్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. సరిగ్గా ఇలాంటి కేక్‌నే ప్రిన్స్ విలియన్స్ పెళ్లికి వాడినట్లు వినికిడి.

English summary
The news of Kim Kardashian’s wedding have gathered in such a huge number, that the details and the preparations, and the final countdown, are getting very close to what happened at the end of April, when Prince William’s royal wedding took place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu