twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్నెట్లో మోస్ట్ డేంజరస్ ఉమెన్‌..?

    By Nageswara Rao
    |

    లండన్: ఇంటర్నెట్లో ఇటీవల ఓ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఏమిటంటే రోజురోజుకి పెరిగిపోతున్న ఇంటర్నెట్ ప్రపంచంలో అందరికంటే డేంజరస్ సెలబ్రిటీ స్టార్ ఎవరా అని. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్‌ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురి అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సర్వేలో డేంజరస్ మోడల్‌గా వచ్చింది ఎవరో తెలుసా సూపర్ మోడల్ హైదీ క్లూమ్.

    ఆన్ లైన్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ వెల్లడించిన సమాచారం ప్రకారం 'ప్రాజెక్టు రన్ వే' జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించిన డౌన్లోడ్స్ ఎక్కవగా ఇంటర్నెట్లో అభిమానులు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద టాప్ పది డౌన్లోడ్స్‌ లలో ఈ జడ్జికి సంబంధించినవే ఎక్కవగా ఉండడంతో మెకాఫీ సంస్ద ఆమె వెబ్ సైట్లోకి వెళితే మీ పర్సనల్ కంప్యూటర్ డామేజి అవుతుందని అన్నారు. ఇంతకీ 'ప్రాజెక్టు రన్ వే' జడ్జి ఎవరనుకుంటున్నారా మన సూపర్ మోడల్ హైదీ క్లూమ్. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుందంటే హైదీ క్లూమ్‌కి సంబంధించిన వెబ్ సైట్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది.

    పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సెలబ్రిటీల వెబ్ సైట్స్ కొంచెం రిస్కీ రిజల్డ్స్‌ని తెస్తున్నాయని తెలిపారు. ఎవరైతే అభిమానులు వారియొక్క కంటెంట్‌ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారో వైరస్ లాంటి వాటిని తమ కంప్యూటర్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకొవాల్సిందిగా కోరడం జరిగింది.

    English summary
    It might come as a shocker to many, but supermodel Heidi Klum has been named the most dangerous star on the internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X