»   »  పాతవి తవ్వింది:అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేనంటే పడి ఛస్తూ ఏం చేసాడంటే...

పాతవి తవ్వింది:అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేనంటే పడి ఛస్తూ ఏం చేసాడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ :ట్విలైట్, న్యూమూన్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించడంతో అందులో నటించిన క్రిస్టినా స్టివార్ట్ హాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్‌ గుర్తింపుని పొందింది. అయితే ఆమె సినిమాల ద్వారా తెచ్చుకున్న క్రేజ్ కన్నా తన కామెంట్స్, ట్వీట్స్ ద్వారా తెచ్చుకున్న కీర్తే ఎక్కువ. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంతటా సంచలనం అయ్యింది.

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాలుగేళ్ల క్రితం తానంటే పడి చచ్చేవాడని క్రిస్టెన్ స్టెవార్డ్ చెబుతోంది. అప్పట్లో ట్రంప్ చేసిన ' ట్వీట్'లను మరోసారి గుర్తుకు తెచ్చుకుందీ హాట్ బ్యూటీ. వాటిని ఇప్పుడు గుర్తు చేయటంలో అంతరార్దం ఏమిటని ఇప్పుడు మీడియా ప్రశ్నిస్తోంది. క్రేజ్ కోసమేనా లేక మరే వేరేవి ఏమైనా ఆశించా అనేది తెలియటం లేదంటున్నారు. అమెరికా ప్రసెడెంట్ సైతం తనకు లైన్ వేసాడని చెప్పటం ద్వారా ఆమె మీడియా సెన్సేషన్ అయ్యింది.

ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత, క్రిస్టెన్ మీడియాతో మాట్లాడుతూ... 2012లో ట్రంప్ రియాలిటీ షోలు చేస్తున్న వేళ, తాను చిన్న నటినని, ఆ సమయంలో నిజంగా తానంటే ట్రంప్ పడి చచ్చేవాడని గర్వంగా చెప్పుకుంది. 2008 నుంచి తనతో సహజీవనం చేసిన రాబర్ట్ ప్యాటిన్ సన్ తో మనస్పర్థలు వచ్చి విడిపోయిన తరువాత, ట్రంప్ స్పందించాడని గుర్తు చేసుకుంది. ఆమె గురించి అప్పట్లో ట్రంప్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ విషయమై క్రెస్టిన్ మాట్లాడుతూ.., " ఆ సమయంలో , ఆయన కేవలం ఓ రియాల్టి స్టార్ అంతే, అది రియాలటీ విషయం. అయితే ఇప్పుడు చాలా మంది నా అబిమానులు ఆ విషయం గుర్తు చేస్తున్నారు. ఓహ్..నిజమే కదా అప్పట్లో ఆయన నా గురించి ఇలా ట్వీట్ చేసారు కదా అనుకున్నాను!'" అంటూ చెప్పుకొచ్చింది ఆమె.

Kristen Stewart says President Donald Trump was 'obsessed with her'

క్రిస్టినా స్టివార్ట్ 1990వ సంవత్సరం ఏప్రిల్ 9న జన్మించారు. క్రిస్టినా స్టివార్ట్ మొదట్లో పలు చిత్రాలలో నటించినప్పుటికీ తనకి మాత్రం బాగా పేరు తెచ్చిన పెట్టిన సినిమా ట్విలైట్ సాగా. ఇక 2007వ సంవత్సరంలో విడుదలైన ది మెసెంజర్స్, ద రన్ ఎవేస్, పానిక్ రూమ్ లాంటి సినిమాలతో బాక్సాఫీసు హీరోయిన్‌గా మారారు.

ప్రస్తుతం తన స్కూలింగ్‌ని పూర్తి చేసిన క్రిస్టినా స్టివార్ట్ రాబోయే కాలంలో కాలేజీలో చేరి తనకు ఇష్టమైన 'సాహిత్యం' అభ్యసించాలనుందని ఆ మధ్యన వెల్లడించారు. దీనితోపాటు తన జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటే తన తల్లి జన్మించిన ఆస్టేలియాలో సెటిల్ అవ్వాలని కొరుకుంటున్నట్లు తెలిపారు.

English summary
Kristen Stewart has slammed Donald Trump for being "obsessed" with her. The 26-year-old actress has spoken about US president Donald Trump, recalling when he took an interest in her with a series of tweets in which he voiced his opinion about the actress' personal life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu