»   » మోడల్ భామతో హాలీవుడ్ నటి వివాహం.. ఫొటోలు..

మోడల్ భామతో హాలీవుడ్ నటి వివాహం.. ఫొటోలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విదేశాల్లో నచ్చినవారెవరైరానా సరే ఆడ, మగ అనే తేడా లేకుండా సహజీవనం ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్. హాలీవుడ్‌ నటి క్రిస్టిన్ స్టెవార్ట్, ఐర్లాండ్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం సంచలనం రేపింది.

సెమీ న్యూడ్‌గా

సెమీ న్యూడ్‌గా

ఇటీవల పెర్ఫ్యూమ్ వ్యాపార ప్రకటనలో సెమీ న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చి క్రిస్టిన్ సంచలనం రేపింది. అంతేకాకుండా తన భాగస్వామి ఆడా.. మగా ఎవరో ఇప్పుడే చెప్పలేనంటూ వ్యాఖ్యలు చేసి తన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే.

గతేడాది నుంచి

గతేడాది నుంచి

గతేడాది నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న క్రిస్టెన్ స్టెవార్ట్, మోడల్ స్టెల్లాలు దక్షిణ కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకొనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లిదుస్తులు , ఇతరత్రా సామాగ్రి కోసం షాపింగ్ మొదలుపెట్టారని లోకం కోడైకూస్తున్నది.

అలీసియా కార్గైల్‌తో

అలీసియా కార్గైల్‌తో

మాజీ నెచ్చలి అలీసియా కార్గైల్‌తో ప్రేమాయణం నడిపిన నటి క్రిస్టెన్‌కు మధ్య విభేదాలు నెలకొన్నడంతో వారిద్దరు విడిపోయారు. అప్పటినుంచి ఐర్లాండ్ మోడల్‌తో సహజీవనం చేస్తున్నది.

రాబర్ట్ పాటిన్సన్‌తో డేటింగ్

రాబర్ట్ పాటిన్సన్‌తో డేటింగ్

తొలుత నటుడు రాబర్ట్ పాటిన్సన్‌తో డేటింగ్ చేసిన క్రిస్టెన్ అతడితో బ్రేకప్ చేసుకుని ఆ తర్వాత సింగర్ స్టెఫానీ 'సోకో'తోనూ ప్రణయబంధాన్ని కొనసాగించింది. చివరికి మోడల్ స్టెల్లానే తన జీవితభాగస్వామి అంటూ ఇటీవల ప్రకటించింది.

English summary
Kristen Stewart might be taking her relationship with Stella Maxwell to the next level. The two have reportedly moved in together and are rumored to be talking about an engagement. Will Stewart tie the knot before her Twilight ex, Robert Pattinson?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu