»   » అదిరింది :'కుంగ్‌ఫూ పాండా-3' కొత్త ట్రైలర్‌ (వీడియో)

అదిరింది :'కుంగ్‌ఫూ పాండా-3' కొత్త ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: సూపర్ హిట్ ..కుంగ్‌ఫూ పాండా సిరీస్‌లో మరో చిత్రం అయిన 'కుంగ్‌ఫూ పాండా-3' చిత్ర కొత్త ట్రైలర్‌ని విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ విడుదల కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ కొత్త ట్రైలర్ అలరిస్తోంది.

ఈ చిత్రానికి అలెజాండ్రో కార్లొని, జెన్నిఫర్‌ యు నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్‌ వర్క్స్‌ యానిమేషన్‌, ఓరియంటల్‌ డ్రీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని అలరించిన యానిమేషన్‌ చిత్రం కుంగ్‌ఫూ పాండా. కుంగ్‌ఫూ పాండా, కుంగ్‌ఫూ పాండా-2 చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్‌లోనే తాజాగా కుంగ్‌ ఫూ పాండా-3 వస్తోంది.

KUNG FU PANDA 3 – OFFICIAL INTERNATIONAL TRAILER

కుంగ్‌ఫూ పాండా' తెరమీద చేసే విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను అన్ని దేశాల్లోని ప్రేక్షకులూ విపరీతంగా అభిమానించారు. ఈ యానిమేషన్‌ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఆంజిలినా జోలీ, డస్టిన్‌ హాఫ్‌మాన్‌, జాకీ చాన్‌ వంటివారు డబ్బింగ్‌ చెప్తూంటారు. జాకీచాన్‌ మార్షల్‌ ఆర్ట్‌లో కామెడీ ఎలిమెంట్‌ జోడించడంతో ఫైటింగ్‌ సీన్లు మరింత ఆకట్టుకుంటుంది. సినిమా నిండా కిక్ల్‌, పంచ్‌లు, సమర్‌సాల్ట్‌లు, ధడేలని పడిపోవడాలూ, పో ఎంతో ఇమోషన్‌తో ఆకట్టుకోవడం అంతా అన్నీ వుంటాయి.

2004లో స్టీఫెన్‌ చో ‘కుంగ్‌ఫూ హసల్‌' అనే చిత్రమే ఈ కుంగ్‌ఫూ పాండా చిత్రాల సీరిస్ కు స్పూర్తినిచ్చిందంటారు. అయితే ఈ చిత్రంలోనూ ప్రతిష్టాత్మక చైనా కుంగ్‌ఫూనే చూపాలన్నది గట్టిగా నమ్మారు. దానికోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రేమాండ్‌ జిబాక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ టాంగ్‌ హెంగ్‌లు చాలా కాలం చైనా పెయింటింగ్స్‌, ఆర్క్‌టెక్చర్‌, కుంగ్‌ఫూ చిత్రాలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిం చారు. ఆ పరిశీలనతో తెలుసుకున్న అనేకాంశాల ఆధారంగానే ఈ యానిమేషన్‌ చిత్రాన్ని పకడ్బందీగా రూపొందించారు.

English summary
In 2016, one of the most successful animated franchises in the world returns with its biggest comedy adventure yet, KUNG FU PANDA 3. IN CINEMAS 1st April.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu