»   » ఫుల్ ఫన్ : ' కుంగ్‌ ఫూ పాండా-3' ట్రైలర్

ఫుల్ ఫన్ : ' కుంగ్‌ ఫూ పాండా-3' ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఈ రోజున ప్రపంచంలో కుంగ్ ఫూ పాండా గురంచి తెలియని చిన్నారులు అరుదనే చెప్పాలి. చిత్రమైన ఫన్నీ ఆకారంతో మురిపించే ఈ పాండా అందరి మన్ననలూ పొందింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన యానిమేషన్‌ మూవీ కుంగ్‌ఫూ పాండా చిత్రం ...తాజాగా ఈ సిరీస్‌లో మూడో భాగం ట్రైలర్‌ను డ్రీమ్‌వర్క్స్‌ టీవీ నిర్మాణ సంస్థ యూట్యూబ్‌ ద్వారా విడుదల చేసింది. అయితే ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం వచ్చే జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జాక్‌ బ్లాక్‌, ఏంజెలీనా జోలీ, డస్టిన్‌ హాఫ్‌మెన్‌, జాకీచాన్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటులు డబ్బింగ్‌ చెప్పడం విశేషం. తాజాగా విడుదలైన ఆ ట్రైలర్‌ మీకోసం..

Kung Fu Panda 3 Official Trailer

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని అలరించిన యానిమేషన్‌ చిత్రం కుంగ్‌ఫూ పాండా. కుంగ్‌ఫూ పాండా, కుంగ్‌ఫూ పాండా-2 చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్‌లోనే తాజాగా కుంగ్‌ ఫూ పాండా-3 వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌లో ముందుగా మాస్టర్‌ షీఫెల్‌ రాబోయే యుద్ధం గురించి హెచ్చరిస్తుంటాడు.

మరో విలన్‌ పాత్ర కాయ్‌ మిగతా కుంగ్‌ ఫూ మాస్టర్ల నుంచి వారి శక్తులను దోచుకోవాలని చూస్తుంది. కొద్ది సేపు ఓ భవనంపై యుద్ధం జరగడం, ఆఖరికి కాయ్‌ ఓ విగ్రహంతో చైనా భవనాన్ని పడగొట్టడాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. జనవరి 29, 2016లో ఈ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Kung Fu Panda 3 Official Trailer

కుంగ్‌ఫూ పాండా' తెరమీద చేసే విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను అన్ని దేశాల్లోని ప్రేక్షకులూ విపరీతంగా అభిమానించారు. ఈ యానిమేషన్‌ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఆంజిలినా జోలీ, డస్టిన్‌ హాఫ్‌మాన్‌, జాకీ చాన్‌ వంటివారు డబ్బింగ్‌ చెప్తూంటారు. జాకీచాన్‌ మార్షల్‌ ఆర్ట్‌లో కామెడీ ఎలిమెంట్‌ జోడించడంతో ఫైటింగ్‌ సీన్లు మరింత ఆకట్టుకుంటుంది. సినిమా నిండా కిక్ల్‌, పంచ్‌లు, సమర్‌సాల్ట్‌లు, ధడేలని పడిపోవడాలూ, పో ఎంతో ఇమోషన్‌తో ఆకట్టుకోవడం అంతా అన్నీ వుంటాయి.

Kung Fu Panda 3 Official Trailer

2004లో స్టీఫెన్‌ చో ‘కుంగ్‌ఫూ హసల్‌' అనే చిత్రమే ఈ కుంగ్‌ఫూ పాండా చిత్రాల సీరిస్ కు స్పూర్తినిచ్చిందంటారు. అయితే ఈ చిత్రంలోనూ ప్రతిష్టాత్మక చైనా కుంగ్‌ఫూనే చూపాలన్నది గట్టిగా నమ్మారు. దానికోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రేమాండ్‌ జిబాక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ టాంగ్‌ హెంగ్‌లు చాలా కాలం చైనా పెయింటింగ్స్‌, ఆర్క్‌టెక్చర్‌, కుంగ్‌ఫూ చిత్రాలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిం చారు. ఆ పరిశీలనతో తెలుసుకున్న అనేకాంశాల ఆధారంగానే ఈ యానిమేషన్‌ చిత్రాన్ని పకడ్బందీగా రూపొందించారు.

English summary
Kung Fu Panda 3 is set for release early next year, and a trailer gives us our first taste of the movie. In 2016, one of the most successful animated franchises in the worldreturns with its biggest comedy adventure yet, KUNG FU PANDA 3.When Po's long-lost panda father suddenly reappears, the reunited duo travels to a secret panda paradise to meet scores of hilarious new
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu