»   » స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తోంది.... ఆ సినిమానే నిషేదించారు (కథ ఇదే)

స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తోంది.... ఆ సినిమానే నిషేదించారు (కథ ఇదే)

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాల్ట్‌ డిస్నీ సంస్థ నుంచి వచ్చే సినిమా అంటే ఖచ్చితంగా ఒక క్రేజ్ ఉంటుంది జనాల్లో. గ్రాఫిక్స్, యానిమేటేడ్ ఫార్ములాతో ఎక్కువగా జానపద కథలని పోలి ఉండే సినిమాలను నిర్మించే వాల్ట్ డిస్నీ నిర్మించిన అత్యద్భుత యానిమేషన్‌ చిత్రాల్లో 'బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌' ఒకటి. మళ్ళీ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని ఒక దేశ ప్రభుత్వం ఏకంగా నిషేదించింది కారణం ఏమిటంటే...

1991లో విడుదలైన

1991లో విడుదలైన

1991లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అప్పట్లో బ్రహ్మరథం పట్టారు. ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి యానిమేషన్‌ చిత్రంగా సంచలనం సృష్టించింది. గోల్డెన్‌ గ్లోబ్‌ ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకుంది. దాదాపు పాతికేళ్ళ తర్వాత అదే సినిమాని లైవ్‌ యాక్షన్‌ సినిమాగా డిస్నీ రిమేక్‌ చేసింది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తోనే సంచలనం సృష్టించింది....

బ్యూటీ గర్ల్ బెల్లె

బ్యూటీ గర్ల్ బెల్లె

బ్యూటీ గర్ల్ బెల్లె(ఈ పాత్రని ఎమ్మా వాట్సన్‌ చేసింది) సాహసాలు చేయటం ఇష్టం. అయితే అంతటి సాహసవంతు రాలిని బీస్ట్‌ అనే వ్యక్తి ఆ యువతిని బందీగా చేసుకుంటాడు. తలపై కొమ్ములు.. బారెడు జట్టుతో చూడ్డానికి అతనో మృగంలా ఉంటాడు. ఐ సినిమాలోని విక్రం ఒక పాటలో ఈ బీస్ట్ రూపం లో కనిపిస్తాడు.

ఆ పాటకి స్పూర్థి

ఆ పాటకి స్పూర్థి

ఆ పాటకి స్పూర్థి కూడా 91 లో వచ్చిన ఈ సినిమానే. అయితే నిజానికి ఈ బీస్ట్ ఒకప్పుడు యువరాజు. ఓ మంత్రగత్తె శాపం కారణంగా అనాకారిగా మారిపోతాడు. ఎప్పుడైతే ఓ యువతి ప్రేమను పొందగలుగుతాడో అప్పుడు శాప విముక్తి కలిగి అతని ఆకృతి మామూలు స్థితికి వస్తుంది.

అందుకే బెల్లెను బీస్ట్‌

అందుకే బెల్లెను బీస్ట్‌

అందుకే బెల్లెను బీస్ట్‌ తన కోటలో బంధిస్తాడు. ఆమె ప్రేమని పొందగలిగిన నాటు తాను మనిషిగా మారే రిఓజుకోసం ఆ మృగమనిషి తపన. మరి ఆమె మనసును అతను గెలుచుకోగలిగాడా? బెల్లె ప్రేమను పొందడానికి బీస్ట్‌ ఏం చేశాడు? అన్న అంశం చుట్టూ ఈ కథ సాగుతుంది.

అయితే ప్రపంచం మొత్తం

అయితే ప్రపంచం మొత్తం

అయితే ప్రపంచం మొత్తం మెచ్చిన ఈ సినిమాకి కువైట్ లో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. ఉన్నట్టుండీ ఆ సినిమాని ప్రదర్షించే అన్ని థియేటర్లూ ప్రదర్షణని ఆపివేయాలని ఉత్తర్వులు అందాయి. కువైట్‌లో వారం రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు.

ట్రైలర్లు విడుదల చేసిన

ట్రైలర్లు విడుదల చేసిన

ట్రైలర్లు విడుదల చేసిన కొద్దిరోజుల్లోనే కోటల వ్యూస్ సాధించిన ఈ సినిమా.. అదే స్థాయి కలెక్షన్లను కూడా కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ డాలర్లను (దాదాపు 2290 కోట్ల రూపాయలు) ఈ సినిమా ఇప్పటికే కొల్లగొట్టింది. అయితే కువైట్ ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

స్వలింగ సంపర్కాన్ని

స్వలింగ సంపర్కాన్ని

స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయనీ, అందుకే కువైట్‌లో ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు నేషనల్ సినిమా మెంబర్ ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలోనూ ఇకపై షోలు ఉండబోవని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రీఫండ్ చేస్తామని వెల్లడించారు.

English summary
The Kuwait National Cinema Company said on Tuesday it has decided to ban Disney’s hit movie ‘Beauty and the Beast’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu