»   » ప్యాషన్ కోసం పచ్చి మాంసంతో తయారుచేసిన బికిని ధరించింది..!

ప్యాషన్ కోసం పచ్చి మాంసంతో తయారుచేసిన బికిని ధరించింది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సింగర్ లేడీ గాగా కోత్తతనం కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ నెలలో వోగ్ పత్రక మొదటి పేజికి పచ్చి మాంసంతో తయారుచేసినటువంటి బికిని ధరించి ఫోజు ఇవ్వడం జరిగినది. ఈ ఫోజుకి గాను జంతువులు పరిరక్షణ సంఘం వాళ్శు వ్యతిరేఖత వ్యక్తం చేశారు. ఆ ఫోజుని ప్రముఖ పోటోగ్రాఫర్ టెర్రి రిచర్డ్సన్ చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ ఫోటోషూట్ సమయంలో లేడీ గాగా పలకవలే ఉండే మాంసం ముక్కని తన నుదురుపై రాక్ బాండ్ మాదిరి ధరించారని ఆయన వివరించారు.

దీనిపై స్పందించిన జంతువులు పరిరక్షణ సంఘం వాళ్శు లేడీ గాగాని దుయ్యబట్టారు. లేడీ గాగా ప్యాషన్ కోసమే ఇలాంటివి అన్ని చేస్తుందని, విదేశి వస్తువులు ధరించినా మాకు అభ్యంతరం వుండదని, కాని ఇలాంటి జంతువులు చంపి వాటి మాంసంతో ఫోటోలకు ఫోజులిస్తే ఒప్పుకునేదిలేదని వారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు లేడీ గాగా లోపల పేజీలలో సరికోత్త రూపంతో అందరికి మతి పోగోట్టింది. ఆ రూపం ఏంటంటే అందమైన అమ్మాయి కాస్త అందమైన అబ్బాయిగా దర్శనమించింది. అసలు ఇంగ్లీషు వాళ్శు ఏదో చేద్దామని అనుకుంటారు, చివరకి ఇలా వివాదాల్లో చిక్కుకుంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu