రేప్ ఘటనలపై లేడీ గాగా వీడియో: చూడటం ఇబ్బందే కానీ....
లాస్ ఏంజిల్స్: అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా ‘టిల్ ఇట్స్ హాప్పెన్స్' పేరుతో కొత్త వీడియో విడుదల చేసింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనలను ఫోకస్ చేస్తూ ఈ వీడియో తెరకెక్కించారు. చూడటానికి ఈ వీడియో కాస్త ఇబ్బందిగానే ఉన్నా మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది చూపించారు.

మహిళలు సెక్సువల్ వయొలెన్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే అవగాహన తేవడంలో ఈ వీడియో తోప్పడుతుందని అంటున్నారు. అమెరికన్ కాలేజీల్లో ప్రతి ఐదు మంది అమ్మాయిల్లో ఒకరు సెక్సువల్ హరాస్మెంటుకు గురవుతున్నారు.
ఈ సమస్యను బేస్ చేసుకుని ‘టిల్ ఇట్స్ హాప్పెన్స్' పేరుతో వీడియో ఆల్బం విడుదల చేసారు. కాలేజీ అమ్మాయిలు, తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ఇలాంటి పోకడల పట్ల అప్రమత్తం ఉండాలనే ఒక సందేశంతో ఈ వీడియో తెరకెక్కించారు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రతి దేశంలో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారనేది వాస్తవం.


Click it and Unblock the Notifications











