»   » వెక్కివెక్కి ఏడ్చేలా చేసిన పుట్టినరోజు కానుక

వెక్కివెక్కి ఏడ్చేలా చేసిన పుట్టినరోజు కానుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సింగర్ లేడీ గాగా గత ఆదివారం నాడు తన 24వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ఓ షో నిమిత్తం ఆస్ట్రేలియాలో వున్న ఆమె అక్కడే తన పుట్టినరోజు సంబరాలను జరుపుకుంది. తన పుట్టినరోజును పురస్కరించుకొని చాలా మంది అభిమానులు తనకు కానుకలు పంపారని అందులోని ఓ కానుక తనని ఆనందంతో గట్టిగా ఏడ్చేలా చేసిందని ఆమె తెలిపింది.

ఈ విషయాన్ని ఓ సోషియల్ నెట్ వర్క్ లో స్వయంగా ఆమే వెళ్లడించింది. నాకు మీరు పంపిన కానుకలకు, జన్మదిన శుభాకాంక్షలకు చాలా కృతజ్ఞతలు. ఇలా వచ్చిన సందేశాలలో ఓ సందేశం నన్ను చిన్న పిల్లలా వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. అలాంటి సందేశం పంపిన అభిమానికి ధన్యవాదాలు అంటూ చెప్పింది. కానీ ఆ సందేశం సారాంశం ఏంటో బయటపెట్టలేదు ఈ బర్త్ డే బేబీ..

ఇక ఈమె రూపొందించిన తాజా ఆల్బమ్ టెలీఫోన్ భారత్ లో కూడా విడుదల కానుంది. లేడీ గాగా రూపొందించిన ఆల్బమ్ లలో భారత్ లో విడుదలవుతున్న రెండవ ఆల్బమ్ ఇది. ఈ ఆల్బమ్ ఏప్రిల్ 7న ఇక్కడ విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X