»   » 2011ని నాకెరియర్ లో ది బెస్ట్ గా నిలుపుకుంటానంటున్న మోడల్

2011ని నాకెరియర్ లో ది బెస్ట్ గా నిలుపుకుంటానంటున్న మోడల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Lara Bingle
ఓజ్ మోడల్ లారా బింగిల్ ఇటీవల ట్విట్టర్ ద్వారా తన 2010వ సంవత్సరానికి సంబంధించినటువంటి అనుభవాలను పంచుకున్నారు. ఈసందర్బంలో లారా బింగిల్ మాట్లాడుతూ 2010వ సంవత్సరం నాజీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చినటువంటి సంవత్సరం. కాని 2011వ సంవత్సరాన్ని నాకు అనుకూలంగా మలచుకోవాలని అనుకుంటున్నాను అని అన్నారు. ప్రస్తుతం లారా బింగిల్ అమెరికాలో వర్కింగ్ హాలీడేస్ తీసుకోని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. 2011వ సంవత్సరానికి సంబంధించినటువంటి తన ప్యూచర్ ప్లాన్స్ ట్వట్టర్ ద్వారా పంచుకున్నారు.

ఆస్ట్రేలియా రావడానికి నేను ఎక్కవకాలం వెయిట్ చేయ్యలేకపోతున్నాను. దానికి కారణం ఈసంవత్సరం నేను చాలా ప్రోజక్ట్స్ లోపనిచేయాల్సి ఉంది. అంతేకాకుండా 2011ని నాజీవితంలో బెస్ట్ గామలచుకోవడానికి సిద్దంగా ఉన్నానంటూ తన సందేశాన్ని అభిమానులకు తెలిపారు. ఇటీవల కాలంలో లారా బింగిల్ యాడ్ క్యాంపెయిన్ మోడల్ గామారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టివి ప్రాజెక్ట్సులో కూడా కొన్నింటిలో అలా మెరిసిన సంగతి తెలిసిందే. చివరకు వీటన్నింటిని వదిలిపెట్టి తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి ఫ్యాషన్ రంగంలోకి మరలా తిరిగి తన సత్తా చాటాలని అంటున్నారు.

హాలీవుడ్ లో డాన్సింగ్ విత్ ద స్టార్స్ అనే రియాలిటీ షో ఎంత ప్రాముఖ్యం సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మంచి ఆదరణ అభిమానాలు చూరగోన్న ఈకార్యక్రమంలో మూడవ సారి జరిగినప్పుడు అలస్కా గవర్నర్ సారా పాలిన్ గారాల కూతురు బ్రిస్టాల్ పాలిన్ పాల్గోన్న విషయం తేలిసిందే. త్వరలో నాల్గవ భాగాన్ని ప్రారంభించడానకి రంగం సిద్దం చేశారు. ఈనాల్గవ భాగంలో లారా బింగిల్ కూడా పాల్గోనబోతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu