»   » భర్త నుండీ విడిపోయిన నటీమణికి తోడుగా నిలుస్తున్న స్టార్ హీరో

భర్త నుండీ విడిపోయిన నటీమణికి తోడుగా నిలుస్తున్న స్టార్ హీరో

Subscribe to Filmibeat Telugu

టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జంట లినార్డినో డి కాప్రియో మరియు కేట్ విన్స్లెట్ మంచి స్నేహితులు. కేట్ కు ఏ కష్టం వచ్చినా ఆమె వెంట వుండే స్నేహితుల్లో లినార్డినో ముందుంటాడు. కాగా ఇప్పుడు కేట్ తన భర్త, దర్శకుడు శ్యామ్ మెండీస్ నుండీ విడాకులు తీసుకుంటోంది. ఈయన కేట్, లినార్డినో జంటగా రివల్యూషనరీ రోడ్ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మొదలయినప్పడి నుండీ కేట్ కు, శ్యామ్ కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో వారు చాలా కాలం నుండీ విడివిడిగా వుంటున్నారు. ఈ సమయంలో ఆమెకు ఓ మంచి స్నేహితుడిగా రినార్డినో తోడునీడగా నిలిచాడు. కాగా ఇప్పుడు అధికారికంగా విడాకులు పొందుతున్న కేట్ ఒంటరితనాన్ని దూరం చెయ్యడానికి, చేదు జ్ఞాపకాల నుండీ ఆమెను దూరం చెయ్యడానికి రినార్డినో ఎంతో సాయం చేస్తున్నాడట. స్నేహం కేవలం సినిమా వరకే పరిమితం అయ్యే హాలీవుడ్ లో లినార్డినో, కేట్ వంటి స్నేహితులు చాలా అరుదుగా కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu