»   » విమాన ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న రోమాన్స్ హీరో..

విమాన ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న రోమాన్స్ హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టైటానిక్ సినిమా తర్వాత యావత్ ప్రపంచం మొత్తం గుర్తింపు పోందిన స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో. నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంనుండి తృటిలో తప్పించుకున్నారు మన టైటానిక్ సూపర్ స్టార్. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో టైగర్ సమ్మిట్ లోపాల్గోనేందుకు న్యూయార్క ఎయిర్ పోర్ట్ లో డెల్టా ఫ్లయిట్ 30కు సంబంధించినటువంటి బోయింగ్ 767 జెట్ లోబయలుదేరినటువంటి లియోనార్డో డికాప్రియో మరియు తోటి ప్రయాణికులు ఇంజను ప్రాబ్లమ్ వల్ల అత్యవసరంగా విమానాన్ని లాండింగ్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.

అసలు విషయానికి వస్తే న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ నుండి బయులుదేరిన గంట పది నిమిషాలకు విమానం యొక్క ఎడమవైపున ఉన్న ఇంజను ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో విమానంలోని ప్రయాణికులు కంగారు పడ్డారు. బోయింగ్ 767 జెట్ లోమొత్తం 193 ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అందరూ ఒక్కసారిగా కంగారు పడడంతో విమానాన్ని అత్యవసరంగా జెయఫ్ కె ఎయిర్ పోర్ట్ లోలాండింగ్ చేశారు.

ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిఉండవచ్చనన్న అనుమానంతో న్యూయార్క్ ఫైర్ డిపార్ట్ మెంట్ వారు విమానం లాండ్ చేసే ప్రదేశానికి దాదాపు 100 ఫైర్ ఫైటర్స్ నిపంపించడం జరిగిందిన్నారు. ఐతే చివరకు ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదని తెల్చేశారు. చివరగా విమానంలోని ప్రయాణికులు అందర్ని భూమి మీద సేఫ్ గాల్యాండ్ చేయడం జరిగిందని అన్నారు. చివరగా లియోనార్డో డికాప్రియో మాట్లాడుతూ పైలెట్ బృందాన్ని మెచ్చుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu