»   » ఊపేస్తున్న స్కాండల్ పై లియోనార్డో డికాప్రియో చిత్రం

ఊపేస్తున్న స్కాండల్ పై లియోనార్డో డికాప్రియో చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ : 'టైటానిక్‌', 'ది వుల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌', 'రన్నర్‌ రన్నర్‌', 'అవుటాఫ్‌ ది ఫర్నేస్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన లియోనార్డో డికాప్రియో ఇప్పుడు మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సారి ప్రపంచాన్ని కుదిపేసిన ఓ స్కాండల్ చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రూపొందనుంది. ఆ స్కాండల్ ఏంటి...ఆ సినిమా ఏంటి అంటే మొత్తం చదవాల్సిందే.

వాణిజ్య ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న కుంభకోణం - ఫోక్స్‌వాగన్‌ కార్ల ఎమిషన్‌ మోసం. ఈ మోసం గురించిన కథతో ఒక సినిమా తీసేందుకు నటుడు లియోనార్డో డికాప్రియో ఒక పత్రికా విలేఖరితో ఒప్పందం కుదుర్చుకున్నారనేది తాజా వార్త. అసలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలలోని ఫోక్స్‌ వాగన్‌ కార్ల యజమానులు తమకు జరిగిన మోసాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

తాము ఉత్పత్తి చేస్తున్న కార్లు కాలుష్యాన్ని ఏమాత్రం విడుదల చేయవనీ, వాతావరణాన్ని అసలు కలుషితం చేయవంటూ ఆ సంస్థ అమెరికా వంటి అనేక దేశాలలో తమ కార్లను కొనుగోలు దారులకు అమ్మేసింది. తీరా చూస్తే పొల్యూషన్‌ కంట్రోల్‌ పరీక్షలు జరుగుతున్నప్పుడు మాత్రం కాలుష్యం ఏమీ లేనట్టుగా ఫలితాలు చూపిస్తూ, ఆ పరీక్షలు అయిపోగానే, మామూలుగానే కాలుష్యాన్ని వెదజల్లేలా కార్లలో తగిన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారని తెలిసిపోయింది.

Leonardo DiCaprio puts Volkswagen scandal film on the production line

దాంతో అందరూ 'ఇంత మోసమా?' అంటూ అందరూ గగ్గోలు పెట్టేశారు. దీనిమీద అమెరికాలో నేర పరిశోధన శాఖ విచారణ ఆరంభించింది.
ఎంత తక్కువగా అంచనా వేసినా, కనీసం 188కోట్ల డాలర్‌ల జుర్మానా పడే అవకాశం ఉందనీ, దీనికి అదనంగా ఆ కార్ల యజమానులకు నష్టపరిహారం, అమ్మేసిన కార్లను వెనక్కు తెప్పించి, తిరిగి బాగుచేసి ఇవ్వడం వంటి ఇంతర కష్టనష్టాలూ ఆ సంస్థను చుట్టుముడతాయన్నది తెలిసిందే.

ఇంత సంచలనం సృష్టిస్తోన్న కథ, తెరమీద ఇంకా బాగుంటుందని డికాప్రియో అభిప్రాయం.ఈ సినిమా నిర్మాణంలో ప్యారమౌంట్‌ సంస్థ కూడా భాగస్వామి అవుతోంది. కథా రచనను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికా విలేఖరి జాక్‌ ఎవింగ్‌ చేపట్టారు.

లియోనార్డో డికాప్రియో తాజా చిత్రం 'ది రెవనెంట్‌' విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి అలెజాండ్రో గోంజలెజ్‌ ఇనరిట్టు దర్శకత్వం వహిస్తున్నారు. డికాప్రియో నట జీవితంలో ఫోక్స్‌వాగన్‌ కుంభకోణం గురించిన చిత్రం మరో హిట్‌ అవుతుందని పరిశ్రమ పండితుల అంచనా.

English summary
Leonardo DiCaprio’s production company is to bring the story of the Volkswagen emissions scandal to the big screen.
Please Wait while comments are loading...