»   » ఇప్పుడు నాకూతురు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది..!

ఇప్పుడు నాకూతురు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లిండ్సే లోహాన్ ఇటీవల కాలంలో ఈపేరు తెలియని వారుండరంటే నమ్మండి అంతగా పబ్లిసిటీ సంపాదించింది మన డ్రగ్స్ తార. డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న మీన్ గర్ల్స్ హీరోయిన్ మరియు హాలీవుడ్ సెక్స్ బాంబ్ లిండ్సే లోహాన్. లిండ్సే లోహాన్ కు జరిపినటువంటి డ్రగ్స్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆమెకు అక్టోబర్ లో జైలు శిక్ష విధించిన సంగతి అందరికి తెలిసిందే. అటుపిమ్మట లిండ్సే లోహాన్ ను రిహాబ్ కుతరలించడం జరిగింది. రిహాబ్ అంటే డ్రగ్స్ తీసుకన్న వారి కోసం వారి శరీరంలోని ఆడ్రగ్స్ శాతాన్ని తగ్గించడం కోసం ఏర్పాటుచేసినటువంటి మెడికల్ సెంటర్స్.

ఈవివాధం ఇలా ఉండగా తన కూతురు డ్రగ్స్ తీసుకోని చెడిపోతుందంటూ గత ఏడు నెలలుగా పలుసార్లు తన కూతురుపై యుద్దం ప్రకటించినటువంటి మైఖెల్ తిరిగి తన కూతురికి ప్రేమను పంచడానికి సిద్దమయ్యారు. దానికి కారణం తన కూతురు తన తప్పు తెలుసుకోని రిహాబ్ కువెళ్శడం అక్కడ తన వ్యాధి తగ్గిపోవడంతో నాకూతురుని చూడడానికి వచ్చానని మైఖెల్ సగర్వంగా చెప్పారు. దీనితో ఒక్కసారి కాలిపోర్నియాలోని బెట్టీ ఫోర్డ్ క్లినిక్ ఒక్కసారిగా ముద్దులు మరియు కౌగిలింతలతో మెరిసిపోయింది.

ఈసందర్బంలో మైఖెల్ మాట్లాడుతూ ఈరోజు నాకూతురుని చూసి చాలా గర్వపడుతున్నానని అన్నారు. దానికి కారణం చాలా మంది డ్రగ్స్ కిఇట్టే బానిసలు అవుతారు. నాకూతురు అలా కాకుండా అతి తక్కువసమయంలో కోలుకోవడం మాకుబుంబం మొత్తానికి చాలా ఆనందాన్ని కలిగించే విషయం అన్నారు. లిండ్సే లోహాన్ తల్లి దీనా మాట్లాడుతూ రిహాబ్ ట్రీట్ మెంట్ నాకూతురుని మార్చివేసిందని అన్నారు. ప్రస్తుతం నాకూతురు చాలా రిలాక్స్ గా ఆనందం గా ఉందని చెప్పారు. ఈప్రదేశం మాకు చాలా బాగా నచ్చిందని, ఇలాంటి చోట మాత్రమే ఏదైనా జబ్బులు ఉంటే చాలా త్వరగా తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు. ఇంకా మేము ఇక్కడ రెండు వారాల పాటు లిండ్సే లోహాన్ తోగడిపి వెళ్శతామని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu