»   » తండ్రికి గుండెపోటు.. ఆమెకు స్వైన్ ఫ్లూ...!?

తండ్రికి గుండెపోటు.. ఆమెకు స్వైన్ ఫ్లూ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ తార లిండ్సే లోహన్ తండ్రి మైఖేల్ లోహన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను న్యూయార్క్ లో ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఇప్పుడాయన కోలుకుంటున్నారని సమాచారం. ఈయన హాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ లిండ్సే లోహన్ తల్లి నుండీ విడిపోయారు. దీంతో లిండ్సే అసలతను తన తండ్రే కాదనేంతగా ఆయన మీద అసహ్యాన్ని పెంచుకుంది. దీంతో వారెవరూ ఆయన్ని చూడటానికి ఆసుపత్రికి రాలేదు.

ఇదిలా వుంటే లిండ్సేకు స్వైన్ ఫ్లూ వచ్చిందనే వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. దీనికి తోడు ఆమె ట్విట్టర్ లో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా వుంటాయి..? ఇటీవలే నా స్నేహితురాలొకరు ఈ వ్యాధి బారిన పడింది. నాకు కూడా చాలా ఆరోగ్యం సరిగా వుండటం లేదు. దీనికి స్వైన్ ఫ్లూ కారణం కాదని అనుకుంటున్నాను. అయినా ఎందుకయినా మంచిది అని డాక్టర్ ను సంప్రదించడానికి వెళ్తున్నాను అని ట్వీట్ చేసిందట. ఇప్పటికే ఆరోగ్యపరంగా పూర్తిగా నాశనం అయిపోయిన లిండ్సే శరీరం స్వైన్ ఫ్లూ వస్తే తట్టుకోలదని, ఆమెకా వ్యాధి రాకూడదని ఆమె అభిమానులు అభిలాషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu