»   » శీలాన్ని వేలం వేసిన భామకు ఇండియాలో నో ఎంట్రీ

శీలాన్ని వేలం వేసిన భామకు ఇండియాలో నో ఎంట్రీ

Subscribe to Filmibeat Telugu

గతంలో హైతీలో భూకంప బాధితులకు సహాయం చేయడానికి తన శీలాన్ని వేలం వేస్తున్నట్టు ప్రకటించిన హాలీవుడ్ వివాదాల రాణి లిండ్సే లోహన్ ను భారతదేశంలో పర్యటించకుండా నిషేధించాలని భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు యోచిస్తున్నారు. గత డిసెంబరులో పర్యాటక వీసా మీద భారత్ విచ్చేసిన లిండ్సే లోహన్ బిబిసి సంస్థ వారు మనుషుల అక్రమ రవాణా మీద నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొంది. అంతటితో ఆగకుండా తాను భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘించానని, పర్యాటక వీసా మీద వచ్చి మిగతా పనుల కోసం దేశంలో తిరిగినట్టు, ఈ పనిలో భాగంగా తను 40 మంది పిల్లలను కాపాడినట్టు ఆవిడ గారు ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎక్కడపడితే అక్కడ ప్రచారం చేసుకుంటోంది.

దీంతో ఒళ్లు మండిన ఇమిగ్రేషన్ వారు ఆమె పేరును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని యోచిస్తున్నారట. ఇక ఆమె 40 మంది పిల్లలను రక్షించినట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటోందని..ఆమె రాకముందే వారిని రక్షించామని భారత్ లోని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu