»   » డ్రగ్స్ తీసుకోని జైలులో గడపడం వల్లనే అమెను జడ్జిగా తీసుకోలేదు...

డ్రగ్స్ తీసుకోని జైలులో గడపడం వల్లనే అమెను జడ్జిగా తీసుకోలేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పోందినటువంటి రియాలిటీ షో ద ఎక్స్ ప్యాక్టర్. గతంలో ఈ ద ఎక్స్ ప్యాక్టర్ టాలెంట్ షోకి జడ్జిగా వ్యవహారించినటువంటి సైమన్ కోవెల్ కొ్న్ని అనివార్యకారణాలు వల్లే లిండ్సే లోహాన్‌ని తీసుకోవడానికి నిరాకరించడం జరిగిందని తెలిసింది. కాగా ఇప్పుడు ఆటాలెంట్ షోకి జడ్జి ప్యానెల్‌లో డ్రగ్స్ తీసుకోని మొన్నటివరకు రిహాబ్‌లో గడిపినటువంటి ట్రబుల్డ్ స్టార్ లిండ్సే లోహాన్ అవకాశాలు ఉన్నాయంటూ రూమర్స్ వెలువడడం జరిగింది.

కానీ ఈరూమర్స్ అనేవి నిజం కావని శనివారం రాడర్ ఆన్ లైన్.కామ్ వెబ్ సైట్ ఓనర్ ధామ్సన్ వివరించడం జరిగింది. కాగా మంచి ఆదరణ ఉన్నటువంటి ఈషోలో ఇటీవలే జైలులో గడిపివచ్చినటువంటి డ్రగ్స్ తార లిండ్సే లోహాన్‌ని జడ్జిగా తీసుకోవడం వల్ల ప్రేక్షకుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే లిండ్సే లోహాన్ ఈషోకి తీసుకోవడం లేదన్నారు.

లిండ్సే లోహాన్‌ని జడ్జిగా తీసుకోకపోవడానికి చాలా కారణాలున్నాయని జడ్జి ప్యానెల్‌లో ఉన్నటువంటి సైమన్ కోవెల్ వివరించారు. లిండ్సే లోహాన్ ని తీసుకుంటే ప్రజలు ఎలా స్పందిస్తారనే ఉద్దేశ్యంతోనే అలా చేయడం జరిగిందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రేటింగ్స్ దృష్టిలో పెట్టుకోని మరీ ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

English summary
Lindsay Lohan will not be a part of ‘The X Factor’. Rumors had been running wild that the troubled star would be a judge on the highly anticipated talent show, since her notoriety would be good for ratings. But it seems the rumors are not true. “No, Lohan will not be part of the show”, Radar online.com quoted spokeswoman Ann-Marie Thomson as saying on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu