»   » 'జంగిల్‌ బుక్‌' 3డి ఫస్ట్‌లుక్‌ ఇదిగో

'జంగిల్‌ బుక్‌' 3డి ఫస్ట్‌లుక్‌ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్: చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ అకట్టుకునే సాహసం, వినోదంతో 1967లో వాల్ట్‌ డిస్నీ 'జంగిల్‌ బుక్‌' అనే యానిమేషన్ చిత్రాన్ని నిర్మించింది. అప్పట్లో అది ఎంతో ఆదరణ పొందింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 3డి లో సరికొత్తగా మరోమారు 'జంగిల్‌ బుక్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి జోన్‌ ఫేవ్‌ర్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రం 2016లో విడుదల కానుంది.

Look At This First Poster For Disney THE JUNGLE BOOK

వాల్ట్ డిస్నీ సంస్థ తీయనున్న 'ది జంగిల్ బుక్'లో ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది.

''ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం'' అని దర్శకుడు జాన్ ఫేవ్రౌ తెలిపారు.

అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథగా రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన 'ది జంగిల్ బుక్' సుప్రసిద్ధం. ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్‌ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా తీయనున్నారు. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్‌స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు.

Look At This First Poster For Disney THE JUNGLE BOOK

ఇక ఈ చిత్రానికి వాయిస్ లు ఇచ్చేవారు ఎవరూ అంటే...

నీల్ సేధీ మోగ్లీగా కనిపించనుంది. ఎమ్జే ఆంథోని...గ్రే బ్రదర్ పాత్రకు వాయిస్ ఇస్తారు. అలాగే బిల్ ముర్రే..భల్లూ పాత్రకు, బెన్ కింగ్ల్ లే...భగీరా పాత్రకు, ఇడ్రిస్ ఎలబా..షేర్ ఖాన్ పాత్రకు, క్రిష్టపర్ వాల్కన్ ..కింగ్ లూయీ పాత్రకు, స్కార్లెట్ జాన్ సన్..కా పాత్రకు, జింకార్లో ఎస్పిటో...అకేలా పాత్రకు, లుపిటా రక్ష పాత్రకు తమ వాయిస్ లు ఇవ్వనున్నారు.

Look At This First Poster For Disney THE JUNGLE BOOK

ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వారు పంపిణీ చేస్తారు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు Molly Allen, Karen Gilchrist, Peter M. Tobyanse, సంగీతం జాన్ డేబ్ నే అందిస్తారు. సినిమా ఏప్రియల్ 15, 2016లో విడుదల అవుతుంది. ఆగస్టు 5, 2014న ప్రారంభం అయ్యింది.

English summary
The Jungle Book is an upcoming American live-action/CGI film directed by Jon Favreau, written by Justin Marks, and distributed by Walt Disney Pictures.The film's executive producers are Molly Allen, Karen Gilchrist, Peter M. Tobyanse. Music will be written by John Debney. The film will be released in 3D and open on April 15, 2016. Filming began on August 5, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu