»   » ఈ సినిమా అవకాశం నా జీవితాన్నే మార్చివస్తుందని అనుకుంటున్నాను..!

ఈ సినిమా అవకాశం నా జీవితాన్నే మార్చివస్తుందని అనుకుంటున్నాను..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీక్వెల్ లు తీసే సాంప్రదాయానికి నాంది పలికిన హాలీవుడ్ లో సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్ రూపొందుతుంది. అదే సినిమా సూపర్ హిట్ అయితే నాలుగయిదు సీక్వెలు రూపొందుతాయి. తాజాగా ఇదే కోవలోకి వస్తుంది టామ్ క్రూజ్ కు స్టార్ ఇమేజి తెచ్చిపెట్టిన సినిమా మిషన్ ఇంపాజబుల్. ఇప్పటికే ఈ సినిమాకు మూడు సీక్వెల్లు రాగా మూడూ ఘనవిజయాన్ని సాధించాయి. తాజాగా ఈ సినిమాకు నాల్గవ భాగం రూపుదిద్దుకుంటోంది. 2011వ సంవత్సరంలో విడుదల అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు మిషన్ ఇంపాజబుల్-lll సినిమాకు దర్శకత్వం వహించిన జెజె అబ్రమ్స్, పారామౌంట్ ప్రొడక్షన్స్ తో కలసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన మూడు భాగాలకన్నా ఈ సినిమా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందనుందని అబ్రమ్స్ వెళ్లడించారు. ఈ వార్త ఖచ్చితంగా యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే వారికి శుభవార్తే.

ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం హార్ట్ లాకర్ సినిమా హారో జెరిమి రెన్నర్ ని తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. జెరిమి రెన్నర్ నటనను తాను హార్ట్ లాకర్ సినిమాలో చూశానని, టామ్ క్రూయిజ్ ప్రక్కన తను ఐతే బాగుంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా జెరిమి రెన్నర్ తో పాటు ఈ సినిమాలో ఇంకోక హీరోని కూడా తీసుకున్నట్లు ప్రకటించారు. లాస్ట్ హీరో 'జోష్ హాల్లోవే' నికూడా తీసుకున్నట్లు వివరించారు. జోష్ హాల్లోవే అమెరికన్ టివి చరిత్రలో ఎక్కువమంది అభిమానులు సంపాదించిన హీరోగా రికార్డలు కెక్కారు. అంతేకాకుండా ఇతను నటించినటువంటి 'సాయర్' అనే టెలివిజన్ షోలో 'జేమ్స్' పాత్ర అతనికి చాలా పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. దీనిపై స్పందించిన జోష్ హాల్లోవే మాట్లాడుతూ ఈ సినిమా అవకాశం తో నాకు మాంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సినిమాపై నేను చాలా నమ్మకాలు పెట్టకున్నాను. ఈ సినిమా నా సిని జీవితాన్నే మార్చివేస్తుందని అనుకుంటున్నాను అని అన్నారు.

ఇదిలా ఉండగా 'మిషన్ ఇంపాజబుల్' హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందబోయే మిషన్ ఇంపాజబుల్ సీక్వెన్స్ లో ఆయన భార్య, హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ ప్రతినాయికగా నటించనుందని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం ప్రకారం టామ్ క్రూజ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'మిషన్ ఇంపాజబుల్' సినిమా తాజా సీక్వెల్ లో టామ్ తన సహచరిణి క్యాటీతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగా లేడట. దీంతో ఆమెను ప్రతినాయికగా నటింపజేయనున్నట్టు తెలిసింది. ఇంతకు మునుపు వీరు నాయికా-నాయకులుగా నటించిన విషయం తెలిసిందే. దీంతో నాయక-ప్రతినాయికలుగా వీరిద్దరూ ఎలా వుండబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu