»   » ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫిట్ నెస్ సెంటర్స్ ప్రారంభించనున్న పాప్ రారాణి..!

ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫిట్ నెస్ సెంటర్స్ ప్రారంభించనున్న పాప్ రారాణి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాప్ ప్రపంచానికి రారాణి మడోన్నా. ప్రస్తుతం మడోన్నా తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టడమే కాకుండా ప్రపంచం మొత్తం జిమ్స్ ఓపెన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫిట్ నెస్ సెంటర్స్ ని 'హార్డ్ క్యాండీ ఫిట్ నెస్ సెంటర్స్' గా నామకరణం చేశారు. ప్రపంచం మొత్తం మీద పది జిమ్ సెంటర్స్ ని పారంభించాలని, మొదటగా రష్యా, అర్జెంటినా, యూరోపియన్ మరియు ఆసిమా సిటిస్ వీటిని నెలకోల్పనున్నామని తెలిపారు.

ఈ మాభైరెండు సంవత్సరాల పాప్ రాణి ఇప్పటికి కూడా తన యవ్వనాన్ని అలాగే ఉంచుకోవడానికి కారణం ఈవ్యాయాయమేనని పలు సందర్బాలలో చెప్పడం మనకు తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈమె తలపెట్టనటువంటి ఈవెంచర్ లో తనకు ఇరవై నాలుగు గంటలు జిమ్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి మార్క్ ముఖ్యభూమికను పోషించనున్నారని సమాచారం. దీనితోపాటు తన మేనేజర్ కికూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు వివరించారు.

అంతేకాకుండా ఈ హార్డ్ క్యాండీ ఫిట్ నెస్ సెంటర్స్ లో మీరు ఓ కోత్త లోకంలో ఉన్నట్లు ఉంటుందని మడోన్నా తెలిపారు. ఇక్కడ మీకు జిమ్ తోపాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా లభిస్తుందని అన్నారు. వీటితో పాటు కిక్ బాక్సింగ్, యెగా లాంటివి కూడా ఉంటాయని మార్క్ వెల్లడంచారు. మెక్సికో నగరంలో నవంబర్ 9న మడోన్నా మొట్టమొదటి జిమ్ ప్రారంభించనున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu