»   » 26 ఏళ్ల కుర్రాడితో ముదురు భామ ప్రేమాయణం

26 ఏళ్ల కుర్రాడితో ముదురు భామ ప్రేమాయణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ మడోన్నా గురించిన ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్ అయింది. 55 ఏళ్ల సుందరి ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తోందట. 26 ఏళ్ల కొరియోగ్రాఫర్ టిప్ స్టెఫెన్స్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినే ఇలాంటివి మడోన్నాకి కొత్తేమీ కాదు.

మడోన్నా గురించిన ఇతర వివరాల్లోకి వెళితే...ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలవడం ఆమె ప్రత్యేకత. పాపులారిటీ కోసమే ఆమె ఇలా వార్తల్లోకి ఎక్కే పనులు చేస్తుందనేది మరికొందరి వాదన. గత కొన్ని రోజుల క్రితం ఆమె ఓ వ్యక్తిపై నోరు పారేసుకుని వార్తల్లోకి ఎక్కింది.

Madonna reportedly dating Tim Steffens

వాస్తవానికి ఆమె కావాలని నోరు పారేసుకోలేదు. తన కారు డ్రైవర్ అనుకుని పొరబడిన ఆమె....అతనిపై తన మాటల ప్రతాపం చూపించింది. తర్వాత అతను తన కారు డ్రైవర్ కాదు అని తెలిసి నాలిక కరుచుకున్న ఆమె కనీసం సారీ కూడా చెప్పకుండా అక్కడి నుండి జారుకుంది.

ఆ మధ్య ఒక సారి తనపై రేప్ జరిగిన విషయాన్ని బయట పెట్టింది. అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మడోన్నా ఈ విషయాలను వెల్లడించింది. ఆర్టిస్టుగా అవకాశాల కోసం న్యూయార్కులో కష్టపడుతున్న సమయంలో నైప్‌పాయింట్ వద్ద ఆమెపై అత్యాచారం జరిగిందట. అంతే కాకుండా గన్ పాయింట్, తన అపార్టుముంట్ వద్ద మూడు సార్లు తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది.

English summary
Pop diva Madonna is reportedly dating a 26-year-old choreographer Tim Steffens. The 55-year-old singer was previously seen on number of dates with Steffens, a Dutch dancer, in January 2014, reported Contactmusic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu