»   » ఒబామా సినిమాలో 'అవతార్' పక్కన మల్లికా షెరావత్..!!

ఒబామా సినిమాలో 'అవతార్' పక్కన మల్లికా షెరావత్..!!

Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాలో పాండోరాను ఏలే రాజు దగ్గర సేనానిగా పనిచేస్తూ, కథానాయకుడికి తొలుత అడ్డుపడుతూ ఆ తర్వాత సాయపడే త్సుతేయ్ గుర్తున్నాడా..!! ఈ పాత్రలో అందరినీ ఆకట్టుకున్న అలోన్సో కథానాయకుడిగా ఓ సినిమా రూపొందబోతోంది. అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా కథగా రూపొందబోతున్న ఈ సినిమా 2008వ సంవత్సరం యుయస్ ఎన్నికల నేపథ్యంలో సాగనుంది. 'లవ్, బరాక్' పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో అలోన్సో ఒబామా పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర అయిన, ఒబామా కార్యదర్శి అరిథా గుప్తా పాత్రలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ నటించబోతోందని సమాచారం.

కాగా మల్లికా ఇటీవల బాలీవుడ్ ను వదిలేసి (బాలీవుడ్డే వదిలించుకుందో తెలియదు) హాలీవుడ్ లో స్థానం సంపాదించుకోవాలని తెగప్రయాత్నాలు చేస్తోంది. వాటి ఫలితంగానే ఈమెకీ సినిమా ఛాన్సు వచ్చినట్టు తెలిసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu