»   » లైంగిక వేధింపుల్లో మ‌రో టీవీ హోస్ట్: నన్ను క్షమించమంటూ వేడుకున్నాడు, అయినా ఆగని ఆరోపణలు

లైంగిక వేధింపుల్లో మ‌రో టీవీ హోస్ట్: నన్ను క్షమించమంటూ వేడుకున్నాడు, అయినా ఆగని ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
లైంగిక వేధింపుల్లో టీవీ హోస్ట్..!

ఆస్కార్ అవార్డ్ గ్ర‌హీత‌లు, హాలీవుడ్ దిగ్గ‌జాలు అయిన హార్వే వీన్‌స్టీన్, కెవిన్ స్పేసీల అమాన‌వీయ‌ రాస‌లీల‌లు ఇటీవ‌ల ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. బ‌హిరంగ వేదిక‌ల‌పై ఆ ఇద్ద‌రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు బాధితులు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రికి ప‌రిశ్ర‌మ నుంచి అన‌ధికారిక బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌లేదు. కెవిన్ సినిమాల్ని సినిమా వేడుక‌ల నుంచి బ‌హిష్క‌రించారు. వీన్‌స్టీన్‌ని ఆస్కార్ క‌మిటీ నుంచి తొల‌గించారు.

ఎన్‌బిసి చానెల్ హోస్ట్

ఎన్‌బిసి చానెల్ హోస్ట్

ప్ర‌ఖ్యాత ఎన్‌బిసి చానెల్ హోస్ట్ మాట్ లావెర్‌ ఆ జాబితాలో కొత్తగా చేరాడు . వేదింపుల వ్య‌వ‌హారంలో వ‌రుస అల‌జ‌డుల నేప‌థ్యంలో.. మ్యాట్ వ‌ల్ల ఇబ్బందిప‌డ్డ‌ కొలీగ్స్ ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. లైంగిక వేదింపులు ఎదుర్కొన్న వారంతా ఒక‌రొక‌రుగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎనిమిది మంది మ‌హిళా బాధితురాళ్లు అత‌డి నిర్వాకం గురించి సామాజిక మాధ్య‌మాల్లో ఓపెన్ అయ్యారు.

 లైంగికంగా వేదించేవాడ‌ు

లైంగికంగా వేదించేవాడ‌ు

తాము ఎన్‌బిసిలో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో మ్యాట్ లైంగికంగా వేదించేవాడ‌న్న విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల్లో వెల్ల‌డిస్తున్నారు. అంతేకాదు.. మ్యాట్‌పై ఎటాక్ చేస్తూ అత‌డి ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్ర‌మ్‌, ఫేస్‌బుక్ ఖాతాల‌కు సందేశాలు పంపుతూ దూషిస్తున్నారు. దీంతో అత‌డు సామాజిక మాధ్య‌మాల‌న్నిటినీ బ్లాక్ చేయించ‌డం సంచ‌ల‌న‌మైంది.

 ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వాలు కాదు

ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వాలు కాదు

ఓ ప్ర‌క‌ట‌న‌లో మ్యాట్ మాట్లాడుతూ-"నా వ‌ల్ల ఇబ్బందిప‌డిన స‌హ‌చ‌ర ఉద్యోగుల‌ను క్షమాప‌ణ‌లు కోరుతున్నా. నా మాట‌ల వ‌ల్ల, చేష్ట‌ల వ‌ల్ల ఇబ్బంది ప‌డిన వారికి .. బాధ‌ప‌డిన వారికి సారీ చెబుతున్నా. అయితే నాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వాలు కాదు. నా క్యారెక్ట‌ర్‌ను త‌ప్పుగా చూపించ‌డం త‌గ‌దు.

బాధ‌ప‌డుతున్నా

బాధ‌ప‌డుతున్నా

అయితే "నావ‌ల్ల బాధ‌ప‌డిన వారి విష‌యంలో నేను కూడా రియ‌లైజై బాధ‌ప‌డుతున్నా" అని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశాడు మ్యాట్‌. త‌న వ్య‌క్తిగ‌త లాయ‌ర్‌ని క‌లిసి ఓ మీటింగ్‌ని ఏర్పాటు చేశాడు. అత‌డిని ఎన్‌బిసి నుంచి తొల‌గించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

 సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్‌

సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్‌

హార్వే వీన్‌స్టీన్‌.. కెవిన్ స్పేసీ.. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్‌.. చార్లీ రోజ్‌.. వీళ్లంతా లైంగిక వేదింపుల వ్య‌వ‌హారంలో జ‌నం నోళ్ల‌లో నానుతున్న టాప్ హాలీవుడ్ సెల‌బ్రిటీస్‌. ప‌ద‌వులు కోల్పోయి.. సినిమా ఛాన్సుల్లేక‌, ఉద్యోగాలు పోగొట్టుకుని.. నానా హైరానా ప‌డుతున్నారు వీళ్లంతా.

 ప్ర‌ముఖ చానెళ్లు నిషేధించాయి

ప్ర‌ముఖ చానెళ్లు నిషేధించాయి

స్టాలోన్ త‌న‌పై ఆరోప‌ణ‌ల్ని ఖండించినా, ఇప్ప‌టికే అత‌డు రిటైర్డ్ హ‌ర్ట్ అయ్యాడు. ఇక ప్ర‌ఖ్యాత టీవీ హోస్ట్ చార్లీ రోజ్ టీవీ షోల‌ను ప్ర‌ముఖ చానెళ్లు నిషేధించాయి. అత‌డిని హోస్ట్ ప‌ద‌వి నుంచి తొల‌గించాయి. తాజాగా అదే కోవ‌లో మాట్ లావెర్‌ ఇదే తీరుగా లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.

English summary
Matt Lauer has deleted his Twitter and Instagram accounts in the wake of several allegations of sexual harassment made against him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu