వైభవంగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్ వివాహం.. హాజరైన ప్రియాంక చోప్రా
Recommended Video

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. రాజవంశానికి చెందిన ఈ జంట చేతిలో చేయి వేసుకొని అతిథులకు కన్నుల పండుగగా నిలిచారు. హ్యారీ, మేఘన్ పెళ్లికి హాలీవుడ్ సినీ తారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అంగరంగ వైభవంగా హ్యారీ పెళ్లి
హ్యారీ, మేఘన్ వివాహం భారతీయ కాలమానం ప్రకారం శనివారం (మే 19)న లండన్‌లోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జి చాపెల్ చర్చిలో అంగరంగ వైభవంగా జరిగింది. వైభవంగా జరిగిన పెళ్లి తంతును యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక ఆహ్వానితులు
ప్రిన్స్ హ్యారీ పెళ్లిని చూడటానికి దాదాపు 2640 మందిని ఆహ్వనించారు. చర్చిలో జరిగిన వేడుక కోసం 600 మంది అతిథులనే ఎంపిక చేశారు. ఈ రాత్రికి జరిగే విందుకు అతి సన్నిహితులు, కుటుంబ సభ్యులన దాదాపు 200 మందిని ఆహ్వానించారు.

చిరునవ్వులు చిందిస్తూ
విండ్సర్ కాజిలోని సెయింట్ జార్జ్స్ చాపెల్ వద్ద చిరునవ్వుల చిందిస్తున్న మేఘన మార్కెల్. హ్యారీ దుస్తులను ప్రముఖ డిజైనర్ క్లేర్ వైట్ కెల్లర్ డిజైన్ చేశారు. మేఘన్ మాత్రం హ్యారీ తల్లి డయానా 1981లో ధరించిన వెడ్డింగ్ గౌన్‌ను ధరించింది.

పెళ్లి వేడుకలో భాగంగా
పెళ్లి వేడుకలో భాగంగా మేఘన్‌ను చర్చిలోకి ఆహ్వానిస్తున్న ఫాదర్.

ప్రేమగా చూస్తున్న మేఘన్ మార్కెల్
పెళ్లి వేడుకలో హ్యారీ చేతిపై చేయి వేసి ప్రేమగా చూస్తున్న మేఘన్.

ప్రియాంక చోప్రా కూడా
హ్యారీ, మేఘన్ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











