»   » ఈనెలలోనే తెలుగులో 'మెర్క్యురీమేన్'

ఈనెలలోనే తెలుగులో 'మెర్క్యురీమేన్'

Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌ లో ఘన విజయం సాధించిన 'మెర్క్యురీమేన్‌" చిత్రాన్ని అదే పేరుతో జయలక్ష్మీ ఫిలింస్‌ పతాకంపై ద్రోణాదుల వాసంతి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సూపర్‌ మేన్‌, స్పైడర్ ‌మేన్‌, బ్యాట్‌మేన్‌ల తరహాలోనే గాలిలో విహరిస్తూ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించిన 'మెర్క్యురీమేన్‌" కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

అద్భుతమైన గ్రాఫిక్‌ మాయాజాలంతో అనేక మలుపులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించేలా బన్‌డిట్‌ తంగ్డి రూపొందిచారని, ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణః ద్రోణాదుల వెంకట్రావు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu