»   » డబ్బు కట్టలేక హోటల్ నుండీ గెంటివేయబడ్డాడు

డబ్బు కట్టలేక హోటల్ నుండీ గెంటివేయబడ్డాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ మాంత్రికుడు దివంగత మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్నంతటినీ తన పాటలతో ఓ ఊపు ఊపాడు. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ చివరి రోజుల్లో అత్యంత దయనీయమయిన స్థితిలో బ్రతికాడు. హోటల్లో డబ్బుకట్టలేకపోవడంతో ఆయన్ని తన అనుచరులనీ హోటల్ ఖాళీచేసి వెళ్లాల్సిందిగా ఆదేశించారట. ఈ విషయాన్ని స్వయంగా మైఖేల్ కు, అతని పిల్లలకూ బాడీ గార్డుగా పనిచేసిన బిల్ విట్ ఫీల్డ్ ఎబిసీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో స్పష్టం చేసాడు.

క్రెడిట్ కార్డు యాక్సెస్ కాకపోవడంతో మమ్మల్ని వెంటనే డబ్బుకట్టి హోటల్ ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందిగా హోటల్ యాజమాన్యం హుకుం జారీ చేసింది. కానీ అప్పుడు హోటల్ లో కట్టడానికి డబ్బులేకపోవడంతో బిల్ పే చెయ్యకుండానే ఎన్నో అవమానాలతో హోటల్ నుండీ బయటపడ్డామని.. ఈ ఒక్క ఉదాహరణ చాలు మైఖేల్ జాక్సన్ మరణించడానికి ముందు ఎంత దరిద్రంలో వున్నాడో చెప్పడానికి, ఎన్ని అవమానాల పాలయ్యాడో చెప్పడానికి అని ఆవేదనాపూరిత స్వరంతో అన్నాడు బిల్ విట్ ఫీల్డ్. వీటికి తోడు ఆయన చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఈ మానసిక క్షోభతోనే ఆయన ఆరోగ్యం పాడయిందని ఆయన చెప్పాడు. వీటి నుండీ బయటపడటానికే లండన్ లో షో చెయ్యాలను ఏర్పాట్లుచేస్తుండగా ఆయన హఠాత్తుగా మరణించాడని మైఖేల్ ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu