»   » 'డ్యాడీ వుయ్ లవ్ యు'.. 'గ్రామీ'లో హృదయాన్ని హత్తుకున్న మైఖేల్ పిల్లల ప్రసంగం..!!

'డ్యాడీ వుయ్ లవ్ యు'.. 'గ్రామీ'లో హృదయాన్ని హత్తుకున్న మైఖేల్ పిల్లల ప్రసంగం..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ను ఆయన మరణానంతరం కూడా ఎవ్వరూ మరచిపోలేకపోతున్నారు. గత ఆదివారం ఎంతో ఘనంగా జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఆయనకు జీవితసాఫల్య(లైఫ్ టైం అచీవ్ మెంట్) అవార్డును ఇచ్చి గౌరవించింది గ్రామీ. మైఖేల్ తరుపున ఆయన కుమారుడు ప్రిన్స్ మైఖేల్ జాక్సన్, కుమార్తె ప్యారిస్ జాక్సన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంలో అక్కడి వాతావరణం మొత్తం గంభీరంగా అయిపోయింది.

ఆ తర్వాత మాట్లాడిన ప్రిన్స్ మైఖేల్ ప్రసంగం హృద్యంగా సాగింది. తన తండ్రి తరపున ఈ అవార్డు అందుకుంటున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని వ్యాఖ్యానించాడు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుచుకుంటామని, అందుకు తానెంతో గర్వపడతానని చెప్పడంతో స్టేజీ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. తన తండ్రి ఎన్నో పాటలు పాడినా వాటన్నిటి భావం ప్రేమే అని అలాంటి పేమను తన తండ్రి పట్ల, తమ పట్ల చూపుతున్న అభిమానులకు ఎంతో రుణపడివుంటానని తెలిపాడు.

ఆ తర్వాత మైఖేల్ కుమార్తె ప్యారిస్ మాట్లాడుతూ ఒకప్పుడు తన తండ్రి ప్రదర్శన ఇచ్చిన స్టేజీపై వున్నందుకు ఎంతో ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసింది. వుయ్ లవ్ యు డ్యాడ్ అంటూ ముగిసిన ఆమె ప్రశంగం అక్కడున్న వారందరి హృదయాలను హత్తుకుంది.

ఈ సందర్భంగా మైఖేల్ రూపొందించిన చిట్టచివరి 3-డి వీడియో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ 3-డి వీడియోను గత సంవత్సరం జులై లో లండన్ లో జరగాల్సిన మైఖేల్ పాప్ షో కోసం రూపొందించారు మైఖేల్. ఈ 3-డీ వీడియోను జులై లో జరగాల్సిన షో ప్రదర్శించాలనుకున్నారు, కానీ జూన్ 25న మైఖేల్ హఠాన్మరణంతో ఆ షో ఆగిపోవడంతో ఈ వీడియో వెలుగుచూడలేదు. ఈ వీడియో ప్రదర్శనకు అక్కడి వారందరూ ముగ్ధులయ్యారు. మైఖేల్ లేని లోటు పూడ్చలేనిది అని కొందరు వ్యాఖ్యానించుకోవడం కనిపించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu