»   » మైఖేల్ జాక్సన్ హత్య కేసులో కీలక సాక్షాలు లభ్యం

మైఖేల్ జాక్సన్ హత్య కేసులో కీలక సాక్షాలు లభ్యం

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ సింగర్ దివంగత మైఖేల్ జాక్సన్ చనిపోయి ఏడాది కావస్తున్నా ఇంకా విచారణ ఓ కొలిక్కి రాలేదు. కానీ మైఖేల్ మరణంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ముర్రే కీలక పాత్ర వహించినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విజయాన్ని దృఢపరిచేలా ఓ సంఘటన వెలుగుచూసింది. 2009 జూన్ 25న ఉదయం అస్వస్థతకు గురయిన మైఖేల్ వెంటనే తన వైధ్యుడు ముర్రేకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ముర్రే మైఖేల్ కు రెండు మూడు ఇంజెక్షన్లు ఇచ్చాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి హఠాత్తుగా మైఖేల్ తీవ్ర అస్వస్థతకు గురయి స్ప్రహ కోల్పోయాడు. దీంతో వెంటనే డా.ముర్రే ఓ చేత్తో మైఖేల్ నాడీని చైతన్యవంతం చేసేందుకు CPR చేస్తూనే మరో చేత్తో అక్కడున్న మందులను ఎవ్వరికీ దొరకకుండా తను వెంట తీసుకొచ్చిన బ్యాగ్ లో వేసుకోవడం కనిపించింది. ఓ సమయంలో CPR ను మధ్యలో వదిలేసి అక్కడున్న మందులను దాచేసే ప్రయత్నం చేసాడు. అంతే కాకుండా ఎమర్జెన్సీ నెం. 911కు ఫోన్ చెయ్యడంలో కూడా ఉద్దేశ్యపూర్వకంగానే కాలాయాపన చేసాడని తెలిసింది. దీంతో ముర్రే కావాలనే మైఖేల్ కు మోతాదుకు మించి మాదకద్రవ్యాలు అందించడమే కాకుండా.. ఆ మందులను దాచేసే క్రమంలో మైఖేల్ మరణం చాలా త్వరగా సంభవించేలా చేసాడని విచారణలో తేలింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu