»   » అసలు సంగతి పెరుమాళ్లకే ఎరుక..!?

అసలు సంగతి పెరుమాళ్లకే ఎరుక..!?

Subscribe to Filmibeat Telugu

మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడటంలేదు సరికదా ఇంకా బిగుసుకుంటోంది. రోజుకో కొత్త అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైఖేల్ జాక్సన్ చనిపోయాడని డా ముర్రే నిర్ధారించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన మైఖేల్ కు ఆసుపత్రిలో కూడా గుండె కొట్టుకుందట. కానీ ముందుగానే మైఖేల్ జాక్సన్ చనిపోయాడని తెలిపి చికిత్సను ఆపేయడే కాకుండా, ఆంబులెన్స్ ను పిలవడంతో అలసత్వం ప్రదర్శించి కావాలనే ఆయన మృతికి కారకుడయిన డా ముర్రేను శిక్షించాలని మైఖేల్ తండ్రి జియో జాక్సన్ కోర్టుకు విన్నవించుకున్నాడు.

ఇదిలా వుంటే ముర్రే మైఖేల్ జాక్సన్ కు CPR చేయడం మధ్యలో ఆపేసి అక్కడున్న మందు సీసాలను ఎవ్వరికీ కనబడకుండా దాచేయాలని ప్రయత్నించడమే కాకుండా ఆంబులెన్స్ ను పిలవడంలో ఆలస్యం చేసాడని పోలీసులకు నివేదించిన మైఖేల్ బాడీ గర్డ్ ను మైఖేల్ కుటుంబ సభ్యులు ఉద్యోగం నుండీ తొలగించారు. మరిందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అసలు ఈ కేసు చిక్కుముడి ఎప్పుడు వీడనుందో మరి..!?

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu