»   » గే కాదు, మైఖేల్ జాక్స్ గురించి షాకింగ్ న్యూస్...!

గే కాదు, మైఖేల్ జాక్స్ గురించి షాకింగ్ న్యూస్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Michael Jackson's Bodyguards Reveal Singer's Alleged Romances
లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ గురించి పలు షాకింగ్ విషయాలు ఆయన మరణం తర్వాత ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మైఖేల్ జాక్సన్‌ వద్ద పని చేసిన ఆయన ఇద్దరు బాడీగార్డ్స్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. జాక్సన్ సెక్స్ సెషన్ కోసం తాము రెగ్యులర్‌గా అమ్మాయిలను తీసుకొచ్చేవారమని వారు చెప్పుకొచ్చారు. మైఖేల్ జాక్సన్ స్వలింగ సంపర్కుడిగా మారాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ తాజా వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మైఖేల్ జాక్సన్ బాడీగార్డ్స్ జావోన్ బియర్డ్, బిల్ వైట్‌ఫీల్డ్....జాక్సన్‌తో పని చేసిన సందర్భంలోని పలు విషయాలను గుర్తు చేసుకుంటూ 'రిమెంబర్ ది టైమ్: ప్రొటెక్టింగ్ మైఖేల్ జాక్సన్ ఇన్ హిస్ ఫైనల్ డేస్' పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసారు. ఇందులో వారు మైఖేల్ జాక్సన్ సెక్స్ సెషన్ కోసం తరచుగా అమ్మాయిలను తీసుకొచ్చే విషయాన్ని తెలిపారు.

మైఖేల్ జాక్సన్‌కు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే వారని, వారు వచ్చినపుడు తామే స్వయంగా వెళ్లి పికప్ చేసుకుని వచ్చేవారమని, వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తామే దగ్గరుండి చూసుకునే వారమని జావోన్ బియర్డ్, బిల్ వైట్‌ఫీల్డ్ తమ పుస్తకంలో వెల్లడించారు. ఈ పుస్తకంలో మైఖేల్ జాక్సన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఉండటంతో ఈ పుస్తకాన్ని కొనేందుకు పాప్ స్టార్ అభిమానులు పోటీ పడుతున్నారు.

English summary

 Michael Jackson's former bodyguards have claimed that they regularly picked up girls for the late singer, breaking the image of the star who was assumed to be gay and even a paedophile.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu