»   » అమ్మకానికి మైఖేల్ జాక్సన్ నెవర్ ల్యాండ్, రూ. 640 కోట్లు

అమ్మకానికి మైఖేల్ జాక్సన్ నెవర్ ల్యాండ్, రూ. 640 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ చెందిన నెవర్ ల్యాండ్ అమ్మకానికి సిద్దమైనట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టంగా కొనుక్కొని కట్టించుకున్న నెవర్‌ల్యాండ్ అమ్మకం వార్త విని అభిమానులు షాక్ అవుతున్నారు.

మైఖేల్ జాక్సన్ కూతురు బాయ్ ఫ్రెండుతో ఇలా.. (ఫోటో)

నెవర్ ల్యాండ్ అమ్మకానికి సిద్దమైందని, దీని విలువ ప్రస్తుతం రూ. 640కోట్లు పలుకుతున్నదని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని సాంటా బార్బరా సమీపంలో ఓ దీవిని 1987లోనే రూ.100 కోట్ల ఖర్చు పెట్టి మైఖేల్ దీన్ని కొన్నాడు. 2700 ఎకరాల ఈ దీవిలో తన అభిరుచికి తగ్గట్టు ఆయన భారీ భవనాన్ని కట్టించుకొని నెవర్‌ల్యాండ్ అని పేరుపెట్టాడు. జూ, గార్డెన్లు, భారీ థియేటర్లు అందులో ఏర్పాటు చేయించుకున్నాడు.

Michael Jackson's Neverland Ranch hits market

ఫ్యాన్స్ హాపీ: రంగంలోకి మైఖేల్ జాక్సన్ వారసుడు

2005 వరకు జాక్సన్ నెవర్ ల్యాండ్ లోనే గడిపాడు. అప్పట్లో పిల్లలపై లైంగికదాడులు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుండి నెవర్‌ల్యాండ్‌ను ఆయన విడిచిపెట్టాడు. 2009 జూన్ 25న మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత నెవర్ ల్యాండ్ ఇంత కాలానికి వార్తల్లోకి ఎక్కింది. దీని అమ్మకం ద్వారా వచ్చే డబ్బు ఆయన వారసులకు చెందే అవకాశం ఉంది.

English summary
Michael Jackson's Neverland Ranch just hit the market, the Wall Street Journal reports.
Please Wait while comments are loading...