»   » నమ్మలేం కానీ...ఈ ఫొటోలే సాక్ష్యం: హాలీవుడ్‌ నటి ఇంట్లో లక్ష్మీదేవి పూజ

నమ్మలేం కానీ...ఈ ఫొటోలే సాక్ష్యం: హాలీవుడ్‌ నటి ఇంట్లో లక్ష్మీదేవి పూజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: భారతీయ సాంప్రదాయాలను చాలా మంది విదేశీ సెలెబ్రిటీలు ఇష్టపడతారనే విషయం తెలిసిందే. మన సాంప్రదాయాలు, నాగరికత వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి,ప్రభావితం చేస్తూంటాయి. అంతెందుకు చాలా మంది విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు గుళ్లకు వెళ్లడంలాంటివి చేస్తూంటారు.

కానీ మన దేశ సంప్రదాయం గురించి, మనం ఆరాధించే దైవంగురించి అవగాహన లేని వారు తమ ఇళ్లలో పూజలు చేయడంలాంటివి జరగదు. కానీ ప్రముఖ నటి, గాయని మైలీ సైరస్‌ తన నివాసంలో లక్ష్మీదేవి పూజ నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచింది.

#FruitBowl over Super...... 🍇🍐🍑🍒🍌 #offering

A photo posted by Miley Cyrus (@mileycyrus) on Feb 5, 2017 at 8:01pm PST

అమెరికా మొత్తం సూపర్ బౌల్ ఫుట్ బాల్ క్రీడ వైపు ఆసక్తిగా ఉన్న సమయంలో మైలీ సైరస్ లక్ష్మి దేవి పూజ నిర్వహించడం విశేషం. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

సూపర్‌ బౌల్‌ 2017 నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మైలీ ప్రదర్శన ఇవ్వబోతోంది.షో సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటూ తన ఇంటిని పూలమాలలతో అందంగా అలంకరించి పండితులను పిలిపించి లక్ష్మీదేవికి పూజ నిర్వహించింది.

❤️PUJA ❤️

A photo posted by Miley Cyrus (@mileycyrus) on Feb 5, 2017 at 4:56pm PST

లక్ష్మీదేవి ఫొటో పక్కన ఆమె ఆరాధించే కొందరు వ్యక్తుల ఫొటోలను కూడా పెట్టి మరీ పూజ చేసింది. అమ్మవారికి పూలు, పండ్లు, హల్వా నైవేద్యం కూడా పెట్టింది. ఈ ఫొటోలను మైలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మైలీకి మన దేశంలోనూ ఎందరో అభిమానులు ఉన్నారు.

డిస్నీ ఛానల్ 'హన్నా మోంటానా' సిరీస్ ద్వారా మైలీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. యూత్ ఐకాన్ అయ్యింది. తర్వాత గాయనిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరమే రాలేదు.

English summary
When people in the US were busy watching the Super Bowl, singer Miley Cyrus was performing a Lakshmi Puja in her house.Miley Instagrammed a photo from the puja, in which one worships Lakshmi, the goddess of wealth. The picture shows a traditional prayer set-up."Fruit bowl over Super... offering," she captioned her image.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu