twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంది పిల్లపై ఆ హాట్ బ్యూటీకి ఎంత ప్రేమో?

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: అమెరికన్ హాట్ బ్యూటీ, సంచలన సింగర్ మిలీ సైరస్ తన పెంపుడు పంది పిల్లను ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఇటీవల దాన్ని పెడిక్యూర్ చేయించడానికి సెలూన్‌కు తీసుకెళ్లింది కూడా. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆమె తన సోషల్ నెట్వర్కింగు పేజీలో పోస్టు చేసింది. అయితే ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే ఆమె ఇబ్బందుల్లో పడింది. ఇలా పంది పిల్లలకు రసాయనిక ఉత్పత్తులు వాడటం వల్ల వాటికి హాని జరుగుతుందని పలువురు అభిమానులు విమర్శలు చేయడం ప్రారంభించారు.

    ఆమె పోస్టు చేసిన మరో ఫోటోలో....తను ఇష్టంగా చేసుకునే పంది పిల్లకు పెడిక్యూర్ చేయిస్తూ మరో చేతిలో బ్రష్ పట్టుకుని దానిని శుభ్రం చేస్తూ కనిపించింది. దీనిపై ఆమె ఇంతగా ప్రేమ ఒలక బోస్తున్నా.....దానిక పట్ల ఆమె చేస్తున్న పనులు మాత్రం జంతు ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

    Miley Cyrus Gets Her Pet Pig A Pedicure, Causes Uproar

    పంది పిల్ల కాలి గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడం, రసాయనాలు ఉపయోగించి పెడిక్యూర్ చేయడం లాంటి వల్ల వాటికి అనారోగ్య సమస్యలు వస్తాయని యానిమల్ లవర్స్ ఆగ్రహంగా ఉన్నారు. కోపంతో ఆమెను ‘పంది' అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే మిలీ సైరస్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.

    Miley Cyrus Gets Her Pet Pig A Pedicure, Causes Uproar

    మిలీ సైరస్ పెంచుకుంటున్న ఈ పెంపుడు పంది పేరు బుబ్బా. ఆగస్టు నెలలో ఆమె దీన్ని దత్తత తీసుకుంది. అంతకు ముందు ఆమె వద్ద ఓ కుక్క ఉండేది. అదంటే ఆమెకు ఎంతో ఇష్టం. అయితే అది మరణించడంతో బుబ్బా అనే ఈ పంది పిల్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది.

    English summary
    Singer Miley Cyrus is in new trouble now after she posted some pics of her pet pig getting a pedicure. The 'Wrecking Ball' singer has been bashed by many of her fans for giving her pig a pedicure, saying that the chemicals might harm the animal. Cyrus, 21, recently posted pictures of pig Bubba Sue getting a pedicure on Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X