»   »  పెంపుడు చేప చనిపోయిందని,పాట రాసి,పాడింది (వీడియో)

పెంపుడు చేప చనిపోయిందని,పాట రాసి,పాడింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ : మనం పెంపుడు జంతువులును పెంచుకుంటాం..మరికొందరు వాటిని ప్రేమిస్తారు..కానీ చాలా మంది వాటికోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. అవి చనిపోయినా..బ్రతికున్నా...అలాంటి అరుదైన వ్యక్తుల కోవకు చెందినదే మైలీ సైరస్.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన పెంపుడు చేప చనిపోవడం జీర్ణించుకోలేకపోయింది హాలీవుడ్‌ పాప్‌ గాయని మైలీ సైరస్‌. చేప చనిపోవడంతో తను ఎంత కోల్పోయిందో చెబుతో ఓ పాటను రూపొందించింది.

ఆ పాటను మీరు ఇక్కడ చూడండి...

ఆ పాటను చేపకు అంకితమిచ్చేసి తన ప్రేమను చాటుకొంది. ఈ వీడియోను అంతర్జాలంలో ఉంచింది. హృదయాలను కదలించేలా ఉందట ఈ పాట. ''ఇన్నేళ్లుగా తను ఎప్పుడూ స్పర్శించి ఎరగని పాబ్లోపై నాకింత ప్రేమ ఉందని నాకే తెలియదు. పాబ్లో లేకపోవడం నాకు తీరని లోటు''అని ఆ పాటలో పేర్కొంది మైలీ.

Miley Cyrus new song dedicated to her dead pet blowfish

కెరీర్ విషయానికి వస్తే..

ఆ మధ్య హాలీవుడ్లో అతి దరిద్రమైన సెలబ్రిటీ రోల్ మోడల్ ఎవరూ అని పోల్ నిర్వహించగా అందరూ కూడా మైలీ సైరస్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారు.డైలీ మెయిల్ అందించిన సమాచారం ప్రకారం 18 సంవత్సారాల వయసు కలిగినటువంటి మైలీ సైరస్ మిచ్‌గాన్‌లో తన బాయ్ ప్రెండ్ లైమ్ హెమ్స్‌వర్త్‌తో పుల్‌గా తాగి డాన్స్‌లు వేస్తూ మద్య మద్యలో సిగరెట్లు తాగుతూ కెమెరా కంటికి చిక్కారు. 2009వ సంవత్సరంలో మైలీ సైరస్ తన ఆటో బయోగ్రఫీలో 'మైల్స్ టు గో'లో నాకు అసలు పోగ త్రాగడం అంటేనే పడదు అన్న స్టేట్ మెంట్‌కి ఈ ఫోటోలను చూసినటువంటి అభిమానులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు

డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ మైలీ సైరస్. గతంలో మైలీ సైరస్ తన సహనటుడు లైమ్ హెమ్స్ వర్త్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. అటువంటి సమయంలో వారివురు. ఈ వార్తలని వీరిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గతంలో ఈజంట ఇద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' నటించారు. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారు. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీసిన విషయం తెలిసిందే.

English summary
Miley Cyrus has poured her love into a new song dedicated to her late blowfish Pablow.The 22-year-old singer shared a video to her Facebook page which shows her breaking down in tears during a performance of the melancholy ballad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu