»   » కొత్తబాయ్ ఫ్రెండుతో బీచ్‌‌లో రొమాన్స్ చేసిన బ్యూటీ (ఫోటోస్)

కొత్తబాయ్ ఫ్రెండుతో బీచ్‌‌లో రొమాన్స్ చేసిన బ్యూటీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ సూపర్ మోడల్ మిరండా కేర్ తన కొత్త బాయ్ ఫ్రెండుతో చాలా హ్యీపీగా గడుపుతోంది. స్నాప్‌చాట్ సీఇఓ ఇవాన్ స్పీగల్‌తో ఫ్రేమలో పడ్డ ఆమె గత నెలలో లాక్స్ ఎయిర్ పోర్టులో తొలిసారి ఇద్దరూ కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. తాజాగా ఈ ఇద్దరూ బీచ్ లో రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు.

Miranda Kerr & Beau Evan Spiegel's PDA Packed Beach Vacation

Courtesy of AKM-GSI/E! News

కోస్టారికాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగి పోయారు. 32 ఏళ్ల మిరండా కేర్ కు ఇప్పటికే పెళ్లయి విడాకులయ్యాయి. ఇంగ్లీష్ యాక్టర్ ఓర్లాండో బ్లూమ్‌ను 2010లో పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు తల్లయింది. 2013లో ఇద్దరూ విడిపోయారు. గతేడాది ఇవాన్ స్పీగల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇవాన్ స్పీగల్ ఆమె కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. అతని వయసు 25 మాత్రమే.

Miranda Kerr & Beau Evan Spiegel's PDA Packed Beach Vacation

మాజీ ‘విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్' అయిన మిరండా ఖేర్ ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన కొత్త బాయ్ ఫ్రెండుతో ఆమె బికినీలో ఎంజాయ్ చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీ ధరించిన మిరండా ఖేర్ ఇవాన్ స్పీగల్ తో రొమాన్స్ చేస్తూ... సముద్రంలో విహరించింది.

గత నెలలో ఇద్దరూ లాక్స్ ఎయిర్ పోర్టులో కలిసి దర్శనమిచ్చినపుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారనే విషయం ఖరారైంది. ఎయిర్ పోర్టులో మీడియా వారి ముందు ఆమె తన ప్రియుడిని హత్తుకుని ముద్దాడటం ద్వారా తాము డేటింగులో ఉన్న విషయం బయట పెట్టింది ఈ సుందరాంగి.

English summary
Lovebirds Miranda Kerr and Evan Spiegel made their first public appearance last month when they arrived together at LAX airport. The couple have taken their romance to the beach and enjoying an intimate vacation together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu