Just In
- 3 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 31 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 2 hrs ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్టేలియా ఆస్కార్స్‌లో ఆమె అందాలు అధ్బుతం..!
విక్టోరియా సీక్రెట్ మోడల్ మిరందా కెర్ ఆస్టేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్(AACTA) అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, తన అంద చందాలతో అక్కడున్న అభిమానులను ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్నారు. 28 సంవత్సరాల వయసు కలిగిన మిరందా కెర్ ఈ అవార్డుల ఫంక్షన్‌కి వేసుకొచ్చిన డ్రస్సు అక్కడ చర్చనీయాంశంగా మారింది.
సిడ్నీ ఓపెరా హౌస్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి మిరందా కెర్ ధరించిన రాగి కలర్ డ్రస్సు ఆమెను ఓ అత్యంత సౌందర్యవతిగా కనిపించేలా చేసింది. మిరందా కెర్ ధరించిన గౌనుని ఆస్టేలియన్ డిజైనర్ 'కొలెట్టే డిన్నిగాన్' రూపొందించారు. ఈ అవార్డుల వేడుకకు వచ్చిన ఆస్టేలియన్ పెద్ద సెలబ్రిటీలలో మిరందా కెర్ ఒకరు.
మిరందా కెర్ ఈ అవార్డుల కార్యక్రమంలో తాను పోషించిన రోల్‌తో పాటు, ఓపెరా హౌస్ నిర్మాణానికి మంత్ర ముగ్దురాలై వాటికి సంబంధించిన కొన్ని ఇమేజిలను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక మిరందా కెర్, ఇంగ్లీషు సూపర్ హీరో ఓర్మాల్డ్ బ్లూమ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పది నెలలు క్రితం 'ప్లైన్' అనే బాబు పుట్టడం జరిగింది.
ఇది మాత్రమే కాకుండా న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన 'విక్టోరియా సీక్రెట్ ప్యాషన్ షో'లో ఆమె ధరించిన బ్రా ధర తెలిస్తే అభిమానులు అవాక్కైపోయారు. ఇంతకీ మిరందా కెర్ ధరించిన బ్రా ఖరీదు ఎంతని అనుకుంటున్నారా.. అక్షరాలా రూ 12.75 కొట్లు.
మిరందా కెర్ అలా అందమైన ఆణిముత్యం లాంటి డ్రస్సు మీద నడుస్తూ వస్తుంటే అక్కడున్న చూపరులు తమచూపుని తిప్పుకొలేక పోయారంటే నమ్మండి. మిరందా కెర్ ధరించిన బ్రాలో 3,400 రత్నాలు, 142 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు వజ్రాలు, ముత్యాలతో పాటు 18 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు బంగరాన్ని బ్రాలో నిక్షిప్తం చేయడం జరిగింది.