‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్యాన్స్ కు శుభవార్త, ఆరో పార్ట్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు
‘మిషన్ ఇంపాజిబుల్6’ చిత్రం ని శరవేగంతో పూర్తి చేసి జూలై 27, 2018న విడుదల చేయాలని నిర్ణయించారు.
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి సుపరిచితమైన సినిమా 'మిషన్ ఇంపాజిబుల్' . సీక్రెట్ ఏజెన్సీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌గా 'మిషన్ : ఇంపాజిబుల్' రూపొందింది. విజువల్ ట్రీట్‌తో అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసిన ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇప్పటికి ఈ సీరిస్ లో ఐదు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం కు రంగం సిద్దమైంది.
విడుదలైన ప్రతీసారీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో మరో చిత్రంగా 'మిషన్ ఇంపాజిబుల్6'ను నిర్మించదలిచినట్లు ప్యారమౌంట్ వారు ప్రకటించారు. ఈ చిత్రం ని శరవేగంతో పూర్తి చేసి జూలై 27, 2018న విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు పారామౌంట్ వారు.

'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో ఆరో చిత్రంగా 'మిషన్ ఇంపాజిబుల్: రోగ్ నేషన్' చిత్రం 2015లో విడుదల అయింది.గతంలో మిషన్ ఇంపాజిబుల్ హీరోయిన్ గా రెబెక్కా ఫెర్గ్‌సన్ నటించింది. మొత్తం 280 కోట్ల డాలర్‌ల కలెక్షన్‌లతో ఆ చిత్రం నిర్మాతలైన ప్యారమౌంట్‌ను చాలా సంతోషపరిచింది. మళ్లీ మరోసారి అదే స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆశతోనే 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో ఆరో చిత్రం తీస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని నిర్మాణంలో స్కైడాన్స్ ప్రొడక్షన్స్ వారు కూడా పాల్పంచుకుంటారు.
ఈ సిరీస్‌లో ఐదో చిత్రంగా 'రోగ్ నేషన్' వచ్చినప్పుడే, 'ఇది హిట్ అయితే, మీరు ఆరో చిత్రం కూడా చూస్తారు' అంటూ హీరో టామ్ క్రూజ్ చెప్పారు. ఆ మాట ఇప్పుడు కార్యరూపం ధరిస్తోందన్నమాట! మరి, ఆరో చిత్రానికి కూడా ఐదో చిత్రానికి దర్శకత్వం వహించిన ఈథన్ హంట్ దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











