»   » ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు: ‘మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్ (ట్రైలర్)

ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు: ‘మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్ ట్రైలర్

హాలీవుడ్ నుండి వచ్చే జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో..... అదే తరహాలో సాగే 'మిషన్ ఇంపాజబుల్' స్పై థ్రిల్లర్ సీరిస్ చిత్రాలకు అంతే పాపులారిటీ ఉంది. టామ్ క్రూయిస్ అండ్ టీం చేసే సాహస విన్యాసాలు చూసి వరల్డ్ వైడ్ కోట్లాది మంది ఈ సినిమాలకు అభిమానులైపోయారు. ఈ సీరిస్‌లో ఇప్పటి వరకు 5 సిరీస్ చిత్రాలు రాగా.... తాజాగా 6వ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

మిషన్ ఇంపాజబుల్-పాలౌట్

మిషన్ ఇంపాజబుల్-పాలౌట్

తాజాగా ఈ సిరీస్‌లో 6వ చిత్రం ‘మిషన్ ఇంపాజబుల్ -పాలౌట్' 2018 జులై 27న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు మరికొన్ని నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు.

 ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు

ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు

తాజాగా విడుదలైన ట్రైలర్లో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిస్ చేసే ఒళ్లుగగుర్బొడిచే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారిలో ఈ ట్రైలర్ అంచనాలు మరింత పెంచింది.

 స్టార్ డైరెక్టర్ క్రిస్టోపర్ మెక్ క్వారీ

స్టార్ డైరెక్టర్ క్రిస్టోపర్ మెక్ క్వారీ

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోపర్ మెక్ క్వారీ.... ఇంతకుముందు జాక్ రీచర్, మిషన్ ఇంపాజబుల్-రోగ్ నేషన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దీంతో పాటు అనే భారీ హాలీవుడ్ చిత్రాలకు రచయితగా పని చేశారు. తన తాజా చిత్రానికి దర్శకత్వంతో పాటు రచయితగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 భారీ తారాగణం

భారీ తారాగణం

ఈ చిత్రంలో టామ్ క్రూయిస్, రెబుక్కా ఫెర్గూసన్, సిమన్ పెగ్, వింగ్ హామెస్, మైచెల్లె మోనాఘన్, అలెక్ బాల్ద్విన్, సీన్ హారిస్, హెన్రీకావిల్, వెనెస్సా కిర్బీ, సియాన్ బ్రూక్ తదితరులు నటిస్తున్నారు.

ట్రైలర్ ఇదే

ప్రఖ్యాత హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానుంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Watch the official trailer for Mission: Impossible - Fallout starring Tom Cruise. In theatres 7.27.18. The best intentions often come back to haunt you. MISSION: IMPOSSIBLE - FALLOUT finds Ethan Hunt (Tom Cruise) and his IMF team (Alec Baldwin, Simon Pegg, Ving Rhames) along with some familiar allies (Rebecca Ferguson, Michelle Monaghan) in a race against time after a mission gone wrong. Henry Cavill, Angela Bassett, and Vanessa Kirby also join the dynamic cast with filmmaker Christopher McQuarrie returning to the helm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu