»   » సెలబ్రిటీలకు బ్రతికున్నంత కాలమే కాదు చచ్చినా మనశ్శాంతి దొరకదు

సెలబ్రిటీలకు బ్రతికున్నంత కాలమే కాదు చచ్చినా మనశ్శాంతి దొరకదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇది ప్యాశ్చాత్యుల వికృతచర్యలకు నిదర్శనం. దివంగత ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అభిమానలు వున్నారో అంతే మంది దురభిమానులు వున్నారు. ఆయన బ్రతికున్నంత కాలం ఏదో ఓ వివాదంతో ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసిన వారు ఆయన చనిపోయిన తర్వాత కూడా తమ వికృతచర్యలతో ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు. వీరిచ్చే డబ్బుకు మైఖేల్ సమాధి భద్రతాధికారులు కూడా అమ్ముడుపోవడంతో వీరి చర్యలు పెచ్చుమీరుతున్నాయి. ఒకొక్కరి నుండీ 2 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసిన భద్రతాధికారులు సమాధిని చూడనివ్వడానికే కాదు ఏం చెయ్యడానికైనా అమతిచ్చేస్తున్నారు.

దీంతో దురభిమాన ఘనులు సమాధి మీద అశ్లీల చిత్రాలు, అసభ్యకర భంగిమలతో ఫొటోలు దిగడమే కాకుండా సమాధిని ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వార్త విన్న మైఖేల్ కుటుంబసభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడి భద్రతాధికారులు కూడా విధ్వంసకారకులతో చేతులు కలపడంతో ప్రస్తుతం మైఖేల్ సమాధి వద్దకు అతని కుటుంబ సభ్యులు మినహా వేరెవ్వరినీ అనుమతించడం లేదు. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలకు బ్రతికున్నంత కాలమే కాదు... చనిపోయినా కూడా మనశ్శాంతి దొరకదని అనిపిస్తోంది కదూ..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu